Begin typing your search above and press return to search.

మరో మిస్సిండియా ఎంట్రీ ఇస్తోంది

By:  Tupaki Desk   |   10 Jan 2018 8:37 AM GMT
మరో మిస్సిండియా ఎంట్రీ  ఇస్తోంది
X
ఈ మధ్య కాలంలో సౌత్ పై మోడల్స్ ఎక్కువగా దృష్టి సాధిస్తున్నారు. నార్త్ లో చిన్న అవకాశం దక్కించుకోవడం కంటే ఇక్కడ చిన్న అవకాశం దక్కించుకుని మంచి సక్సెస్ అవ్వచ్చు అని ప్లాన్స్ వేస్తున్నారు. నార్త్ లో సినిమా పరంగా హీరోయిన్స్ రేంజ్ పెరుగుతూ ఉంటుంది. కానీ నార్త్ లో హిట్టు సంగతి తరువాత ముందు హీరోయిన్ తన పాత్రకు ఎంతవరకు న్యాయం చేసింది అనేది ఎక్కువగా గుర్తిస్తారు. అలా ఇక్కడ గుర్తింపు పొంది నార్త్ వెళ్లిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే.

ముఖ్యంగా మిస్ ఇండియా లెవెల్లో పార్టీసీపేట్ చేసిన మోడల్స్ ఎక్కువగా సౌత్ లోనే అవకశాలు దక్కించుకునే విదంగా అడుగులు వేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ - అదితి ఆర్యా వంటి చాలా మంది హీరోయిన్స్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే. ఇక లేటెస్ట్ గా మరో తార ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. 2015 మిస్ ఎకో ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ కిరీటాన్ని గెలుచుకున్న 22 ఏళ్ల మోడల్ సోఫియా సింగ్ ఒక తెలుగు సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది.

రవి చవళి అనే దర్శకుడు తెరకెక్కించబోయే సినిమాలో అమ్మడు సరికొత్తగా కనిపించనుందట. ఆ సినిమాకి స్కెచ్ అని టైటిల్ ను కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక సామాజిక కార్యకర్త అయిన విదేశీయురాలిగా కనిపిస్తానని సోఫియా చెప్పారు. "హత్య మిస్టరీ యొక్క దర్యాప్తు ఆధారంగా ఈ చిత్రం ఒక థ్రిల్లర్ తరహాలో ఉంటుందట. అంతే కాకుండా ఇది ప్రాథమికంగా తెలివైన నేరస్తులు మరియు నిజాయితీ గల పోలీసుల మధ్య పోరాటం "అని సోఫియా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే మరికొన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా ఈ భామ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.