Begin typing your search above and press return to search.

వ‌య‌సుతో పనేముంది వేడెక్కించాలే కానీ!

By:  Tupaki Desk   |   19 Dec 2021 11:30 AM GMT
వ‌య‌సుతో పనేముంది వేడెక్కించాలే కానీ!
X
బాలీవుడ్ హాట్ బాంబ‌ర్ సోఫీ చౌద‌రి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పార్టీ క్రౌడ్ లో నిరంత‌రం ఈ అమ్మ‌డి సంద‌డి ఉంటుంది. `లండ‌న్ బాబులు లండ‌న్ బాబులు` అంటూ ఇంత‌కుముందు ఐట‌మ్ నంబ‌ర్ తో తెలుగు యువ‌త‌ను వెర్రెత్తించింది సోఫీ చౌద‌రి. `1-నెనొక్క‌డినే`లో హాట్ ఐటం నంబ‌ర్ తో ఆక‌ట్టుకున్న సోఫీ ఆ త‌ర్వాత తెలుగులో ఆశించిన అవ‌కాశాలు ద‌క్క‌లేదు. `1-నెనొక్క‌డినే` క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్ కాక‌పోవ‌డం మైన‌స్ అయ్యింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో కూడా ఏ సినిమా చేయ‌లేదు. కొన్ని టీవీ షోస్ చేసిన‌ప్ప‌టికీ అక్క‌డా నిల‌దొక్కుకోలేక‌పోయింది. 40 ప్ల‌స్ బ్యూటీకి ఛాన్స్ లు క‌ష్టంగా మారింది.

ఇటీవ‌ల ఫిట్నెస్ గురువుగా మారి యోగా జిమ్ క్లాసులు చెబుతోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిరంత‌రం హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో హీటెక్కిస్తుంది. తాజాగా బికినీలో సోఫీ అంద‌చందాలు కుర్రాకారుకు కాక‌లు పుట్టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఆక‌తాయిలు బికినీ లుక్ పై హాట్ కామెంట్ల‌తో వేడెక్కిస్తున్నారు.

ఇక సోఫీ బాలీవుడ్ ఎంట్రీ విష‌యానికి వ‌స్తే 15 ఏళ్ల క్రిత‌మే `షాది నెంబ‌ర్ 1` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత `ప్యార్ కి సైడ్ ఎఫెక్స్ట్`.. `ఐ సీయూ`స‌హా చాలా చిత్రాల్లో న‌టించింది. ఎక్కువ‌గా ఆమె ఫోక‌స్ అయింది ఐటం గాళ్‌ గానే. కానీ ఆ ర‌కంగా ఆమె కెరీర్ సాఫీగా సాగ‌లేదు. అవ‌కాశాలు రావ‌డం..మ‌ధ్య‌లో బ్రేకులు ప‌డుతుండ‌డంతో ఏడేళ్లుగా డైల‌మాలోనే ఉండిపోయింది ఈ హాటీ.