Begin typing your search above and press return to search.
#DRUGS కేసు: రకుల్.. సారా పేర్లు.. NCB అధికారి ఏమన్నారు?
By: Tupaki Desk | 15 Sep 2020 5:15 AM GMTసుశాంత్ సింగ్ బలవన్మరణంలో డ్రగ్స్ కోణం బాలీవుడ్ ని గజగజలాడిస్తోంది. ఇందులో బిగ్ షాట్స్ పేర్లు బయటపడడం ఖాయంగా కనిపిస్తోంది. సీబీఐ-ఎన్.సి.బి బృందాలు ఎన్నో కఠోర నిజాల్ని నిగ్గు తేల్చనున్నాయి. గత కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల కుంభకోణానికి సంబంధించిన రియా చక్రవర్తి సంచలన విషయాల్ని బయటపెట్టడంతో మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఇందులో ఇద్దరు కథానాయికల పేర్లు ప్రచారంలోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సిబి) దర్యాప్తులో రియా చెప్పిన 25 పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్.. సారా అలీ ఖాన్ పేర్లు ఉన్నాయని ఇటీవల జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. వాటిని హైలైట్ చేస్తూ స్థానిక మీడియాలు కథనాలు ప్రచారం చేశాయి. అయితే రకుల్ .. సారా సన్నిహితులు అభిమానులు మాత్రం అవన్నీ `పుకార్లు` అని నిరాధరమైనవి అని కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. # సారీరాకుల్ # సోరీసారా వంటి పోకడలు గూగుల్లో ట్రెండ్ అయ్యాయి.
తాజాగా మరోసారి జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు ఎన్.సి.బి డైరెక్టర్ మల్హోత్రా ఆన్సర్ ఇచ్చారు. ``రకుల్ ప్రీత్ సింగ్.. సారా అలీఖాన్ పేర్లు బయట ప్రచారం అయ్యాయి. ఇందులో నిజానిజాలేమిటి? తదుపరి చర్యలేమిటి అన్నదానిపై మేం ఇంకా ఏదీ చెప్పలేం. అనవసర వ్యాఖ్యలు చేయలేం`` అని అన్నారు. ఇప్పటివరకూ ఎన్.సి.బి ఇంకా నోటీసులు లేదా సమన్లు పంపలేదని మల్హోత్రా ధృవీకరించారు. రియా చక్రవర్తిపై దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే రియా 25 మంది సెలబ్రిటీల పేర్లు చెప్పిందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని మల్హోత్రా తెలిపారు. ఈ కేసులో నిజానిజాలేమిటి? ఎవరు దోషులు అన్నది సీబీఐ-ఎన్.సి.బి నిగ్గు తేల్చాల్సి ఉంది.