Begin typing your search above and press return to search.
సౌందర్య రజనీకాంత్ పై దారుణమైన ట్రోల్స్
By: Tupaki Desk | 17 Feb 2019 5:05 AM GMTబిజినెస్ మేన్ విషగన్ వనంగమూడిని పెళ్లాడిన సౌందర్య రజనీకాంత్ ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఐస్ ల్యాండ్ లో ఈ జంట విహరిస్తున్నారు. స్పాట్ నుంచి సౌందర్య కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు వీక్షించిన నెటిజనులు తీవ్రమైన కామెంట్లతో ట్రోల్స్ చేయడం చర్చకొచ్చింది.
ఓ వైపు పుల్వామాలో 40 మంది పైగా సైనికుల్ని తీవ్రవాదులు దారుణంగా హతమారిస్తే, ఇలాంటి టైమ్ లో ఈ సెలబ్రేషన్స్ ఏంటి? అంటూ ఓ నెటిజన్ సౌందర్య రజనీకాంత్ ని ప్రశ్నించారు. వేరొక నెటిజన్ అయితే వ్యక్తిగతంగా నీచమైన వ్యాఖ్యను చేయడం చర్చకొచ్చింది. ``ప్రతిసారీ ఎవరో ఒకరితో ఇలా హనీమూన్ చేసుకోవడం నీకు అలవాటే కదా!!`` అంటూ అమర్యాదపూర్వకంగా మాట్లాడాడు. అయితే సదరు నెటిజన్ వ్యాఖ్యను అందరూ తప్పు పడుతున్నారు. అది రెండో పెళ్లి అయినంత మాత్రాన మరీ ఇంత దారుణంగా అపరిపక్వతతో తిట్టేయడం సరైన పద్ధతి కాదని చీవాట్లు పెడుతున్నారు. ఒక వ్యక్తి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడం తప్పు ఎలా అవుతుంది? అంటూ సదరు నెటిజనుకి గడ్డి పెడుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలు అజాగ్రత్తగా ఉండడం సరికాదు. అనవసరంగా కొన్ని వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చేయకపోవడమే మేలు అని విశ్లేషిస్తున్నారు. సౌందర్యకు మాత్రమే కాదు గతంలో శ్రుతిహాసన్, దీపిక పదుకొనే, అనుష్క శర్మ అంతటి సెలబ్రిటీలకు ఈ బాధ తప్పలేదు. నెటిజన్ అంటేనే అపరిపక్వంగా ఉంటారన్నది కొన్నిసార్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరి!!