Begin typing your search above and press return to search.
డేటింగ్ చేయకపోతే స్టార్ కాలేరు!
By: Tupaki Desk | 12 April 2022 8:00 AM ISTకొన్ని స్టేట్ మెంట్లు చాలా బోల్డ్ గా కనిపిస్తాయి. కానీ వాటిలో నిజం దాగి ఉంటుంది. అలాంటి ఒక కామెంట్ చేసింది ఇటీవల బాలీవుడ్ యువనటి సౌందర్య శర్మ.``ఔత్సాహిక నటీమణులు ఒక నటుడితో లేదా నిర్మాతతో లేదా స్టార్ కిడ్ తో డేటింగ్ చేయకపోతే ఎప్పటికీ ఇక్కడ పెద్ద స్టార్ కాలేరు అని నాకు చెప్పారు`` అని తెలిపింది.
పరిశ్రమ అంతర్గత వ్యక్తితో డేటింగ్ చేయకపోతే ఎలాంటి లాబీయింగ్ లో భాగం కాకపోతే పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టమని చెప్పినట్లు ఒప్పుకుంది. రాంచీ డైరీస్‌తో సినీ రంగ ప్రవేశం చేసిన సౌందర్య శర్మ రక్తాంచల్ సీజన్ 2తో డిజిటల్ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా తన స్టార్ డమ్ ని పెంచుకుంటోంది.
అంతేకాదు.. పరిశ్రమలో తన ప్రయాణం ఎంత కఠినంగా ఉందో కూడా వెల్లడించింది. ఒక బయటి వ్యక్తి... ఆమె లోపలి వ్యక్తితో డేటింగ్ చేయకపోతే పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టమని తనకు చెప్పారని సౌందర్య అంది. కెరీర్ గురించి చెబుతూ.. ఈ ఏడాది మరో నాలుగు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. కాబట్టి ఏకకాలంలో నేను వాటన్నిటి కోసం కూడా షూటింగ్ చేస్తున్నాను.
గత సంవత్సరం నేను లాస్ ఏంజిల్స్ లో ఉన్నాను. నేను నా తల్లిదండ్రులను నూతన సంవత్సరానికి మాత్రమే కలుసుకోగలిగాను.. మళ్లీ సెకండ్ వేవ్ భయపెట్టింది. ఇది నిజంగా కఠినమైనది. నేను ఇంటిని కోల్పోయాను. కానీ నన్ను నేను సానుకూలంగా ఉంచుకోవడానికి నా కుటుంబ సభ్యుల రోజుకు 3/4 సార్లు వీడియో కాల్స్ చేస్తాను. ధ్యానాన్ని అనుసరిస్తాను.. అని తెలిపింది.
గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో రావడం కష్టమేనా? అనే ప్రశ్నకు స్పందించింది. కష్టం అనేది ఒక చిన్నమాట. వైద్య విద్యార్థిగా .. బయటి వ్యక్తిగా నాకు చాలా కష్టం ఎదురైంది. నేను ఒక నిర్మాత లేదా నటుడితో లేదా స్టార్ కిడ్ తో డేటింగ్ చేయడం లేదు. మీకు షుగర్ డాడీ లేదా గాడ్ ఫాదర్ లేరు అని నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరు చాలా హాట్ ... ప్రతిభావంతురాలు.. మిమ్మల్ని ఇక్కడ పెద్ద స్టార్ ని చేయాంటే.. మీరు లాబీలో భాగం కావాలి. .. అని తెలిపారు. ఇది కేవలం నా అచంచలమైన ఆత్మ .. నాపై విశ్వాసం ఉంచి నా తల్లిదండ్రుల మద్దతునివ్వడం వల్ల రెండున్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలో నేను ఇక్కడకు చేరగలిగాను. దేవుడు దయగలవాడు.
ఇప్పుడు చాలా కంటెంట్ ప్లాట్ ఫారమ్ లతో ఎక్కువ మంది నటీనటులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే.. నటీనటులకు OTT ఒక వరం. తమ ప్రతిభను కూడా ప్రదర్శించే అవకాశం లేని వ్యక్తులందరికీ ఇది కచ్చితంగా ఆశ ను పెంచే అవకాశం కల్పించే మార్గం. నేటి కాలంలో ప్రేక్షకులు కొత్త కంటెంట్ తో పాటు ప్రతిభను కోరుకుంటున్నారు.. అని తెలిపింది.