Begin typing your search above and press return to search.

బూరె బుగ్గ‌లు దొండ పెద‌వుతో మురిపిస్తోంది!

By:  Tupaki Desk   |   19 Jun 2022 12:00 PM IST
బూరె బుగ్గ‌లు దొండ పెద‌వుతో మురిపిస్తోంది!
X
రాంచీ డైరీస్- ర‌క్తాంచ‌ల్ వెబ్ సిరీస్ ల‌తో బోలెడంత పాపులారిటీ తెచ్చుకుంది దిల్లీ బ్యూటీ సౌంద‌ర్య శ‌ర్మ‌. యాక్ట‌ర్ కాబోయి డాక్ట‌ర్ అయిన త‌న మామ్ ఇచ్చిన స్ఫూర్తితో సినీరంగంలో అడుగుపెట్టాన‌ని చెబుతున్న ఈ బ్యూటీ న‌ట‌న‌తో పాటు నిరంత‌రం హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో యువ‌త‌రంలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

కాంపిటీష‌న్ వ‌ర‌ల్డ్ లో సౌంద‌ర్య స్థానం ఎక్క‌డ ఉంది? అంటే ఈ నాలుగేళ్ల‌లోనే వేగంగా ఎదిగేసింది ఈ బ్యూటీ. తాజాగా ఫెమినా మిస్ ఇండియా 2022 లో త‌ళుక్కున మెరిసింది. ఈ ఈవెంట్లో నేహాధూపియా లాంటి సీనియ‌ర్ తో పాటు కొంద‌రు పాపుల‌ర్ సెలెబ్స్ అందాల రాణులు రెడ్ కార్పెట్ పై అగ్గి రాజేసారు. ఫెమీనా మిస్ ఇండియా ఈవెంట్ లో సౌందర్య హాట్ లుక్ కి సంబంధించిన‌ వీడియో తాజాగా వైర‌ల్ గా మారింది. సౌందర్య శర్మ డిజైనర్ స్వాతి మిశ్రా డిజైన్ చేసిన ప్రింటెడ్ డ్రెస్ లో త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించింది. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో కెమెరాకు ఫోజులిచ్చిన సౌంద‌ర్య ఈ సిరీస్ నుంచి మ‌రో హాటెస్ట్ క్లోజ‌ప్ ఫోటోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్ లో సౌంద‌ర్య హాటెస్ట్ లుక్ పై యూత్ కామెంట్లు రువ్వుతోంది.

అనుపమ్ ఖేర్ నిర్మించిన రాంచీ డైరీస్ తో తెర‌కు పరిచ‌య‌మైన సౌందర్య శ‌ర్మ న‌టిగా త‌న‌ పాత్రను పోషించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రక్తాంచల్ రెండు భాగాల్లో న‌టించింది. ఢిల్లీకి చెందిన సౌందర్య డెంటల్ స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. బ్రాహ్మ‌ణ యువ‌తి అయినా కానీ రంగుల‌ కలలతో ముంబైకి వచ్చి ప్రస్తుతం వాటిని నెరవేర్చుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. ప్ర‌స్తుతం నాలుగు ప్రాజెక్ట్ లతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. OTTలో మూడు సిరీస్ లు చేస్తోంది. అలాగే ఒక భారీ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉంది.

బూరె బుగ్గ‌లు దొండ పండు పెద‌వుల‌తో ఊరిస్తున్న సౌంద‌ర్య శ‌ర్మ‌ తెలుగు చిత్ర సీమ పైనా మ‌న‌సు పారేసుకుందంటూ గుస‌గుసా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగు హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు ప్లాన్ చేస్తోంద‌ట‌.