Begin typing your search above and press return to search.

ఔను సినిమా నిజమే అనేసిన బిసీసీఐ దాదా

By:  Tupaki Desk   |   13 July 2021 2:30 PM GMT
ఔను సినిమా నిజమే అనేసిన బిసీసీఐ దాదా
X
ప్రస్తుతం ఇండియన్ సినిమా లో బయోపిక్ ల ట్రెండ్‌ నడుస్తోంది. హిందీ.. తెలుగు.. తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా బయోపిక్ లను తెరకెక్కించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినీ నటులు.. రాజకీయ నాయకులు.. శాస్త్రవేత్తలు ఇంకా క్రీడాకారులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారి బయోపిక్ లు బ్యాక్ టు బ్యాక్‌ వస్తున్నాయి. ఇప్పటికే క్రికెటర్‌ ధోనీ మరియు సచిన్‌ ల బయోపిక్ లు వచ్చాయి. ప్రస్తుతం తెరపైకి కొన్ని సినిమాలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇక ఇటీవల కన్ఫర్మ్‌ అయిన బయోపిక్ లు కూడా కొన్ని ఉన్నాయి. ఎందరో మహానుభావుల జీవితాలను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం వల్ల వారి నుండి ఎంతో కొంత మెసేజ్ జనాలకు అందుతుంది. అలాగే వారి జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే బయోపిక్ లు ఎక్కువగా రూపొందుతున్నాయి.

బాలీవుడ్‌ లో మరో బయోపిక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. గత కొన్నాళ్లుగా క్రికెట్‌ లెజెండ్‌ అయిన గంగూలీ బయోపిక్ ను తీసుకు రాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. గంగూలు మొన్నటి వరకు తన బయోపిక్ విషయంలో ఇప్పుడే ఆసక్తి లేదంటూ చెబుతూ వచ్చాడు. కాని ఆయన్ను ఒప్పించారు. ఆయన బాల్యం నుండి బీసీసీఐ బాస్ అయ్యే వరకు పడ్డ కష్టం దక్కించుకున్న విజయాలను అన్నింటిని కూడా సినిమా లో చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. తాజాగా గంగూలీ తన బయోపిక్ విషయమై స్పందించాడు. తన జీవితంను సినిమా గా రూపొందించబోతున్నారా అంటే ఔను అనే సమాధానం ఇచ్చాడు. అయితే ఇప్పుడే దర్శకుడు ఎవరు అనే విషయాన్ని చెప్పలేను అన్నాడు.

ఇక తన పాత్రను ఎవరు పోషిస్తారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కాని ఆయన ఉద్దేశ్యంలో మాత్రం బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ రణబీర్‌ కపూర్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. గంగూలీకి ప్రత్యేకంగా రణబీర్‌ కపూర్‌ అంటే అభిమానం. ఆయనతో ఉన్న సన్నిహిత్యంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ బయోపిక్‌ ను ఆయన చేతిలో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంగూలీ తరహాలో రణబీర్‌ కపూర్‌ ఉంటాడా అనేది చూడాలి. రణబీర్‌ కపూర్‌ మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు కూడా ఈ బయోపిక్ కు గాను చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ హీరోలు ఈ బయోపిక్‌ ను చేయడం వల్ల క్రేజ్‌ మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందుకే స్టార్‌ హీరోను తీసుకునేలా చర్చలు జరుపుతున్నారు. బయోపిక్ కు గంగూలీ ఒప్పుకున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన క్రికెట్‌ ను చూస్తూ పెరిగిన వారు అంటే 1980 కిడ్స్ మాత్రం ఈ బయోపిక్ పట్ల ఫుల్‌ ఎగ్జైట్‌ తో ఉన్నట్లుగా తెలుస్తోంది.

చాలా రోజులుగా వారు ఈ బయోపిక్ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు అయినా గంగూలీ ఓకే అనడంతో ఒక్కసారిగా నెట్టింట ఈ విషయం వైరల్‌ అవుతోంది. దర్శకుడు ఎవరు అనే విషయం త్వరలో ప్రకటిస్తామన్న గంగూలీ ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ప్రస్తుతం గంగూలీ ఉన్న నేపథ్యంలో సినిమా మరింత ప్రాచుర్యంను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కేవలం ఇది ఇండియన్ భాషల్లోనే కాకుండా ఇతర దేశాల భాషల్లో కూడా డబ్బింగ్ చేయాలంటూ గంగూలీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా కు సంబంధించిన మరింత క్లారిటీ ఈ ఏడాది చివరి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.