Begin typing your search above and press return to search.
బిజినెస్ టుడే పై సౌత్ సునామీ!
By: Tupaki Desk | 22 July 2022 1:13 PM GMT`బాహుబలి` నుంచి సౌత్ సినిమాలు బాలీవుడ్ కు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అనే అపోహల గోడల్ని కూకటి వేళ్లతో సౌత్ సినిమాలు పెకిలించి వేశాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి బాలీవుడ్ కళ్లు తెరిపించాయి. ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ పాలిట సౌత్ సినిమాలు సునామిలా మారి బెంబేలెత్తించడం మొదలు పెట్టాయి. దీంతో పలువురు బాలీవుడ్ స్టార్స్, మేకర్స్ ఆలోచనలో పడ్డారు.
పుష్ప, RRR, కేజీఎఫ్ 2 చిత్రాలు బాలీవుడ్ ని మరింతగా భయపెట్టాయి. బాలీవుడ్ సౌత్ ని చూసి నేర్చుకోవాల్సిందేనా అనే సంకేతాల్ని అందించాయి. ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలకు పట్టకడుతూ బాలీవుడ్ మూవీస్ ని డిజాస్టర్ లు మారుస్తున్న తీరు కూడా ఇందుకు అద్దంపడుతోంది. రీసెంట్ గా విడుదలైన `షంషేరా` కూడా తాజాగా డిజాస్టర్ గా మారడంతో బాలీవుడ్ ఇప్పడు ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది.
దీంతో యావత్ ఇండియా మొత్తం సౌత్ ఇండియా వైపే చూస్తోంది అనడానికి ఇండియా టుడే కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫొటోని ప్రచురించడం. తాజాగా బిజినెస్ టు కవర్ పే సౌత్ లో సంచలనాలు సృష్టిస్తున్న బన్నీ, రాజమౌళి, యష్ ల ఫొలోని ప్రదర్శించి ప్రధాన శీర్షికని పొందు పరచడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. `పుష్ప` మూవీతో అల్లు అర్జున్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. హిందీ వెర్షన్ ఎలాంటి పబ్లిసిటీ కుండానే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
పాన్ ఇండియా మూవీగా రికార్డులు నెలకొల్పి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్ ని, హీరోలని కూడా విస్మయానికి గురిచేసింది. ఆ తరువాత వచ్చిన `RRR` కూడా రికార్డులు సృష్టించింది. పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో దుమ్ము దులిపేస్తోంది. ఇక `RRR` తరువాత విడుదలైన `కేజీఎఫ్ 2` కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా బాలీవుడ్ లో హిందీ వెర్షన్ ఏకంగా 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టడంతో అంతా అవాక్కయ్యారు.
వరుసగా సౌత్ నుంచి మూడు క్రేజీ సినిమాలు వంద కోట్లని బాక్సాఫీస్ వద్ద రాబట్టడంతో మన వాళ్లని టాప్ లో నిలబెట్టింది బిజినెస్ టుడే మ్యాగజైన్. తాజా ఎడిషన్ కవర్ పేజీపై ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తూ ఈ అల్లు అర్జున్, రాజమౌళి, యష్ ల ఫొటోలని ప్రచురించింది. `సదరన్ సునామీ` పేరుతో ప్రచురించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాదిలో ఈ ముగ్గురు ఇప్పడు హాట్ టాపిక్ గా మారారని, భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారని వెల్లడించింది. ఇటీవల అల్లు అర్జున్ ఇండియా టుడే కవర్ పేజీపై మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే ఇండియా టుడేకి సంబంధించిన బిజినెస్ టుడే కవర్ పై మునుపెన్నడూ లేని విధంగా ముగ్గురు సౌత్ స్టార్లకు స్థానం దక్కడం విశేషంగా చెబుతున్నారు.
ప్రధానంగా ఈ మ్యాగజైన్ లో దక్షిణాది చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్ ల వివరాలని వివరిస్తూ బాలీవుడ్ పై ఎలా పై చేయి సాధించాయే విశ్లేషించారు. అంతే కాకుండా బాలీవుడ్ ని వెనక్కి నెట్టి దక్షిణాది చిత్రాలు ఉత్తరాది ప్రేక్షకుల పల్స్ ని ఎలా పట్టాయి?..ఎలా వారి ఆదరణని చూరగొంటున్నాయి? అనే విషయాలని సవివరింగా వెల్లడించడం విశేషం.