Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్` కోసం రంగంలోకి సౌత్ క్రేజీ స్టార్స్
By: Tupaki Desk | 23 Feb 2022 1:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ టు బ్యాక్ భారీ చిత్రాలని లైన్ లో పెట్టారు. ఇందులో అన్నీ పాన్ ఇండియా స్థాయి చిత్రాలే కావడం విశేషం. `సాహో` తరువాత ప్రభాస్ నుంచి ఇంత వరకు మరో చిత్రం రాలేదు.
ఈ నేపథ్యంలో చాలా కాలంగా ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు సగటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ప్రభాస్ నుంచి `రాధేశ్యామ్` రాబోతోంది. డెస్టినీకి ప్రేమకు మధ్య సాగే ఆ సక్తికరమైన రొమాంటిక్ ప్రేమకథగా ఈ మూవీని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు.
అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా ప్రత్యేకతలతో సిద్ధమై మార్చి 11న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు.
గత కొంత కాలంగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్ అవుతోంది. యువీ క్రియేషన్స్ తో కలిసి టీ సీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీలోని కీలక పాత్రల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్యశ్రీ నటించారు.
ప్రభాస్ పామిస్ట్ (హస్తసాముద్రిక నిపుణుడు)గా నటిస్తున్నారు. ఊహకందని కథ, కథనాలతో యూరప్ నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని రూపొందించారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంతో చిత్ర బృందం ముందే ట్రైలర్ ని రిలీజ్ చేసింది. అప్పటి నుంచి సినిమాపై అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి. ట్రైలర్ చూసిన ఆడియన్స్ ఇండియన్ స్క్రీన్ పై హాలీవుడ్ సినిమా అనుభూతిని కలిగించే స్థాయిలో సినిమా వుంటుందని అంతా భావించారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ కోసం `రాధేశ్యామ్` టీమ్ క్రేజ్ స్టార్ లని రంగంలోకి దింపేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ మూవీ హిందీ వెర్షన్ కు వాయిస్ ఓవర్ అందించడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని రంగంలోకి దింపేస్తున్న చిత్ర బృందం సౌత్ లాంగ్వేజెస్ కోసం సౌత్ క్రేజీ స్టార్లని సంప్రదిస్తున్నారట. ఇప్పటికే కన్నడ వెర్షన్ కి వాయిస్ ఓవర్ అందించడానికి రాఖీ భాయ్ యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది.
ఇక తమిళ వెర్షన్ కు హీరో సూర్య వాయిస్ ని అందించనున్నారట. మలయాళంలో మోహన్ లాల్ లేదా యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ చెప్పే అవకాశం వుందని చెబుతున్నారు. ఇక కీలకమైన తెలుగు వెర్షన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `రాధేశ్యామ్` కథని నరేట్ చేసే బాద్యతల్ని తీసుకునే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోల్లో ప్రధానంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వినిపిస్తోంది.
గతంలో పవన్ కల్యాణ్ నటించిన `జల్సా` చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. `రాధేశ్యామ్` చిత్రంలో ప్రభాస్ పాత్రని పరిచయం చేయడమే కాకుండా కథ మధ్యలో.. కీలక మలుపు తిరిగే సమయంలోనూ మహేష్ బాబు వాయిస్ అందించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయబోతున్నారని సమాచారం.