Begin typing your search above and press return to search.
మనోళ్లు హిందీ మార్కెట్ బాద్ షాలు
By: Tupaki Desk | 24 Sep 2018 6:29 AM GMTటాలీవుడ్ కి - సౌత్ ఇండస్ట్రీస్ కి ఇరుగు పొరుగు మార్కెట్లు ఆశావహ దృక్పథాన్ని పెంచుతున్నాయ్. డిజిటల్ రైట్స్ - శాటిలైట్ రైట్స్ - డబ్బింగ్ రైట్స్ అంటూ రకరకాల మార్గాల్లో ఆదాయం పెరగడం ఇటీవల చూస్తున్నదే. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న డజను పైగా స్టార్ హీరోల సినిమాలకు ఇరుగుపొరుగు మార్కెట్లలో గిరాకీ అంతకంతకు పెరుగుతోంది. ఇది శుభసూచికం.
రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కిస్తున్న మాస్ మసాలా ఎంటర్ టైనర్ ఆర్ సి 12కి చాలా ముందే హిందీ డబ్బింగ్ బిజినెస్ పూర్తయిందని వార్తలొచ్చాయి. ఈ సినిమాని 22 కోట్లకు ఓ ప్రముఖ బాలీవుడ్ పంపిణీదారు చేజిక్కించుకున్నారని ప్రచారమైంది. నిన్నటికి నిన్న మహేష్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న `మహర్షి` చిత్రానికి హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 22 కోట్లు పలికిందని - నిర్మాతలు 25 కోట్లు కోట్ చేస్తున్నారని - బేరసారాలు సాగుతున్నాయని టాక్ వినిపించింది. ఇక ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న `అరవింద సమేత` హిందీ డబ్బింగ్- శాటిలైట్ కలుపుకుని జీ చానెల్ 23 కోట్లకు కొనుక్కుందని చెప్పుకున్నారు. ఇదివరకూ బన్ని నటించిన `సరైనోడు` శాటిలైట్ - హిందీ - మలయాళం డబ్బింగ్ రైట్స్ కి 13 కోట్లు పలకడం చర్చకొచ్చింది. ఇందులో డబ్బింగ్ రైట్స్ కి 7కోట్ల మేర దక్కింది. ప్రభాస్ `సాహో`కి టీసిరీస్ తో భారీ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే.
దీనిని బట్టి మహేష్ - చరణ్ - బన్ని - ప్రభాస్ వంటి స్టార్ల సినిమాలకు హిందీ డబ్బింగ్ రూపంలో అదనపు మొత్తం నిర్మాత ఖాతాకు చేరుతోంది. అయితే ఈ వెల్లువ ఎప్పుడు మొదలైంది? అని విశ్లేషిస్తే.. సరైనోడు తర్వాత సీన్ ఇదని విశ్లేషిస్తున్నారు. `సరైనోడు` చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ హిందీ వెర్షన్ కి డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయడం అందరికీ కలిసొచ్చింది. అక్కడి నుంచి మన స్టార్ హీరోల సినిమాలకు గిరాకీ అమాంతం పెరిగింది. ఇక బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహోని ప్రతిష్ఠాత్మక టీసిరీస్ భారీ ధరకు కొనేసింది. ఈ సినిమాకి 120 కోట్ల మేర హిందీ శాటిలైట్ - డబ్బింగ్ రైట్స్ పలికాయని అప్పట్లో చర్చ సాగింది. అలానే శంకర్ - రజనీకాంత్ - అక్షయ్ కాంబినేషన్ మూవీ `2.ఓ` హిందీ థియేట్రికల్ రైట్స్ 80 కోట్లకు అమ్ముడైంది. శాటిలైట్ 110 కోట్లు(అన్ని భాషల)కు జీటీవీ ఛేజిక్కించుకుంది. ఇక ఇదే ఊపులో మెగాస్టార్ `సైరా- నరసింహారెడ్డి` - రజనీకాంత్- కార్తీక్ సుబ్బరాజు మూవీ - విజయ్ - మురుగదాస్ `సర్కార్` తదితర సినిమాలకు హిందీ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు. హిందీ మార్కెట్ సౌత్ సినిమాలకు కలిసొచ్చే మార్కెట్ గా రూపాంతరం చెందడం పరిశీలించదగ్గదే.