Begin typing your search above and press return to search.
సౌత్ హీరోయిన్లు.. బాలీవుడ్ ఆశలు..!
By: Tupaki Desk | 10 April 2022 1:30 AM GMTఏ సినీ ఇండస్ట్రీలో అయినా హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలమే ఉంటుంది. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని ప్రతీ ముద్దుగుమ్మ చూస్తుంటుంది. ఈ క్రమంలోనే భాషతో సంబంధం లేకుంటే వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. సౌత్ లో సక్సెస్ అయిన చాలా మంది భామలు.. నార్త్ లోనూ పాగా వేయాలని చూశారు. అందులో కొందరు విజయం సాధించగా.. మరికొందరు మాత్రం ఆశించిన స్థాయిలో బాలీవుడ్ లో రాణించలేకపోయారు.
సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ 2004లో ఓ హిందీ సినిమాలో చిన్న పాత్రతో తెరంగ్రేటం చేసింది. 2007లో 'లక్ష్మీ కల్యాణం' చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనతి కాలంలోనే తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 'సింగం' సినిమాతో మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టిన అమ్మడు.. అక్కడ క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది. 'స్పెషల్ 26' 'దో లఫ్జోన్ కీ కహానీ' 'ముంబై సాగా' వంటి సినిమాలు మాత్రమే చేసింది. పెళ్లి తర్వాత చేసిన 'ఉమ' మూవీ విడుదల కావాల్సి ఉంది.
దక్షిణాది అగ్ర కథానాయికగా వెలుగొందిన త్రిష కృష్ణన్.. 1999లో 'జోడి' చిత్రంలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత రోజుల్లో హీరోయిన్ గా మారి కోలీవుడ్ - టాలీవుడ్ లలో గత రెండు దశాబ్దాలుగా రాణిస్తోంది. అయితే మధ్యలో బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసింది ఈ బ్యూటీ. 'కట్టా మీఠా' అనే హిందీ మూవీలో నటించిన త్రిష.. ఆ తర్వాత మళ్లీ నార్త్ ఇండస్ట్రీ వైపు చూడలేదు. కాకపోతే సౌత్ లో మాత్రం ఇప్పటికే క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 2005 లో ఓ హిందీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. అయితే తెలుగు - తమిళ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఇప్పటికే వరుస అవకాశాలు అందుకుంటూ అదే దూకుడు చూపిస్తోంది. అయితే బాలీవుడ్ మాత్రం తమన్నా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 2013లో 'హిమ్మత్ వాలా'లో నటించిన ఈ బ్యూటీని పరాజయం పలకరించింది. ఆ తర్వాత 'హమ్ శకల్స్' 'ఎంటర్టైన్మెంట్' 'ఖామోషీ' 'బోలే చూడియా' వంటి సినిమాలు చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు మథుర్ బండార్కర్ దర్శకత్వంలో 'బబ్లీ బౌన్సర్' అనే హిందీ సినిమా చేస్తోంది.
'దేవదాసు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా.. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకుంది. ఇక్కడ సఅగ్ర కథానాయికగా రాణిస్తున్న టైమ్ లోనే 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత వరుసగా హిందీ సినిమాలే చేస్తుండటంతో తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. మధ్యలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం చేసినా పరాజయం వెక్కిరించింది. ప్రస్తుతం ఇల్లీ బేబీ హిందీలో 'అన్ ఫెయిర్ & లవ్లీ' తో పాటుగా మరో మూవీ చేస్తోంది.
సీనియర్ బ్యూటీ శ్రియా శరన్ 'ఇష్టం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి రెండు దశాబ్దాలుగా స్టార్ గా వెలుగొందింది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అవకాశాలు అందుకున్న శ్రియా.. 'తుజే మేరీ కసమ్' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఛాన్స్ వచ్చినప్పుడల్లా అడపా దడపా హిందీ సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె నటించిన 'తడ్క' మూవీ ఆలస్యం అవ్వగా.. హిందీ 'దృశ్యం 2' షూటింగ్ దశలో ఉంది.
'మాస్క్' అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. 'ఒక లైలా కోసం' తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ క్రమంలో అగ్ర హీరోలందరితో నటించి క్రేజీ హీరోయిన్ గా మారింది. అయితే 'మొహంజోదారో' అనే ప్లాప్ సినిమాతో బాలీవుడ్ ఆమెకు స్వాగతం పలికింది. అయినప్పటికీ నార్త్ లో గట్టిగా ట్రై చేస్తూ ఆఫర్స్ అందుకుంటోంది. 'హౌస్ ఫుల్' మూవీతో పర్వాలేదనిపించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం 'సర్కస్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది. మరి ఈసారి బాలీవుడ్ లో అమ్మడి కెరీర్ సాఫీగా సాగుతుందో లేదో చూడాలి.
'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ అందుకొని.. ఇప్పుడు 'మిషన్ మజ్ను' తో బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. ఇదే క్రమంలో 'యానిమల్' 'గుడ్ డే' వంటి హిందీ సినిమాల్లో నటిస్తోంది. 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన రాశీ ఖన్నా.. మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయాలని ప్లాన్ చేసుకుంటోంది.
'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో నార్త్ లో పాపులర్ అయిన సమంత.. త్వరలోనే హిందీ సినిమా అనౌన్స్ చేయబోతోంది. 'యారియాన్' చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. గత కొంతకాలంగా సౌత్ కంటే హిందీ చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటోంది. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా త్వరలోనే హిందీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇలా చాలామంది దక్షిణాది క్రేజీ హీరోయిన్స్ బాలీవుడ్ లో రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.