Begin typing your search above and press return to search.
IMDb మోస్ట్ పాపులర్ టాప్ 10 ఇండియన్ మూవీస్ జాబితాలో మన ఆధిపత్యం
By: Tupaki Desk | 14 Dec 2022 9:32 AM GMTసినిమాల రేటింగ్ కు మరియు సెలబ్రిటీల యొక్క రేటింగ్ కు IMDb అత్యంత విశ్వసనీయతను కలిగి ఉంది. కొన్ని సార్లు IMDb రేటింగ్ కు విమర్శలు వచ్చినా యూజర్స్ ఇచ్చే రేటింగ్ అవ్వడం వల్ల ఎక్కడ కూడా డౌట్ లేకుండా చాలా మంది IMDb రేటింగ్స్ ను.. జాబితాలను నమ్ముతూ ఉంటారు.
IMDb తాజాగా 2022 సంవత్సరం యొక్క టాప్ 10 ప్రముఖ ఇండియన్ సెలబ్రిటీల యొక్క జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో ధనుష్ తో పాటు మన సౌత్ స్టార్స్ ఆధిపత్యం ను ప్రదర్శించిన విషయం తెల్సిందే. ఇప్పుడు టాప్ 10 ఇండియన్ మూవీస్ జాభితాలో కూడా సౌత్ ఇండియన్ సినిమాల ఆధిపత్యం క్లీయర్ గా కనిపిస్తుంది.
మొత్తం 10 సినిమాల్లో కశ్మీర్ ఫైల్స్ మరియు రాకెట్రీ సినిమాలు కాకుండా అన్ని కూడా సౌత్ ఇండియన్ సినిమాలే అవ్వడం విశేషం. ఈ ఏడాది మేటి సినిమా గా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్‌ఆర్ సినిమా నెం.1 స్థానంలో నిలిచింది. నెం.2 స్థానంలో హిందీ సినిమా కశ్మీర్ ఫైల్స్ నిలిచింది.
మూడవ స్థానం లో కన్నడ సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ 2 ఉండగా నాల్గవ స్థానంలో తమిళ మూవీ విక్రమ్ నిలిచింది. ఆ తర్వాత వరుసగా కాంతార.. రాకెట్రీ.. మేజర్.. సీతారామం.. పొన్నియన్ సెల్వన్ 1.. 777 చార్లీ సినిమాలు ఉన్నాయి. ఈ జాబితాలో తెలుగు సినిమాలు మూడు ఉండగా కన్నడ సినిమాలు మూడు ఉన్నాయి.
తమిళ సినిమాలు రెండు మరియు హిందీ సినిమాలు రెండు టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. ఈ సారి జాబితాలో తెలుగు మరియు కన్నడ సినిమాల యొక్క ఆధిపత్యం స్పష్టంగా కనిపించడంతో బాలీవుడ్ పై మరోసారి సౌత్ సినీ పరిశ్రమ యొక్క ఆధిపత్యం కనిపిస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.