Begin typing your search above and press return to search.

సౌత్‌ నుంచి ఐఫా బాంబ్స్‌ వీళ్లేనా?

By:  Tupaki Desk   |   9 Jun 2015 7:30 AM GMT
సౌత్‌ నుంచి ఐఫా బాంబ్స్‌ వీళ్లేనా?
X
ప్రతిష్ఠాత్మక ఐఫా వేడుకల్లో రెడ్‌కార్పెట్‌ నడకలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇటీవలే ఈ వేడుకల్లో దేవతల్ని మరిపించే రేంజులో మన కథానాయికలు దర్శనమిచ్చారు. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలు ఇలానే ఉంటారా? అనిపించేంతటి గొప్ప సొగసును వేదికపై ఆవిష్కరించారు. సింపుల్‌ లుక్‌తోనే వేడుకలకు గ్రాండియారిటీ తెచ్చారు. బాలీవుడ్‌ నుంచి దిగొచ్చిన హంస రాణులకు ధీటైన పోటీనిచ్చారు.

ఈ వేడుకల్లో దక్షిణాది ముద్దుగుమ్మలు శ్రీయ శరణ్‌, కాజల్‌ అగర్వాల్‌, అమలాపాల్‌ తమదైన లుక్‌తో ఆకుట్టుకున్నారు. తెలుపు, నలుపు కాంబినేషన్‌ డిజైనర్‌ వేర్‌లో బ్యాక్‌లెస్‌ లుక్‌తో ప్రపంచం కళ్లు తనవైపు తిప్పేసుకునేలా చేసింది కాజల్‌. గౌరి అండ్‌ నైనిక ఈ గౌన్‌ని డిజైన్‌ చేశారు. మెరూన్‌ స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో శ్రీయ సందడి చేసింది. గౌరవ్‌ గుప్తా ఈ డ్రెస్‌ని డిజైన్‌ చేసి మన దేవకన్యకి అందించారు. అలాగే మరో భామ అమలాపాల్‌ తన భర్త విజయ్‌ సహా ఐఫా వేడుకల్లో దర్శనమిచ్చింది. వంగపువ్వు రంగు డ్రెస్‌ ధరించి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే బాలీవుడ్‌ నుంచి దీపిక, అనుష్క, సోనాక్షి, పరిణీతి రెడ్‌ కార్పెట్‌ని అల్లాడించారు. ఈ భామలు తమదైన లుక్‌తో ఆకట్టుకున్నారు.

అయితే దక్షిణాది నుంచి కేవలం నలుగురే నలుగురు ముద్దుగుమ్మలు ఈ వేడుకల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. కేవలం ఈ నలుగురేనా? ఇంకెవరూ లేరా? అని ముచ్చటించుకున్నారంతా. నవతరం కథానాయికల్లో జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతున్న భామలెవరూ బిజీ షెడ్యూల్స్‌ వల్ల ఇలాంటి వేడుకలకు వెళ్లలేకపోతున్నారని సీన్‌ చెబుతోంది. అదీ సంగతి.