Begin typing your search above and press return to search.
బాలీవుడ్ పై సౌత్ సినిమా దండయాత్ర అంటే ఇదే..!
By: Tupaki Desk | 13 Jun 2022 11:30 PM GMTకరోనా పాండమిక్ టైంలో కుదేలైన ఇండియన్ బాక్సాఫీస్.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అనేక పాన్ ఇండియా సినిమాలు - బిగ్ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలో భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేసాయి.
2022 బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు సక్సెస్ అయిన సినిమాలను గమనిస్తే.. అందులో మెజారిటీ భాగం దక్షిణాది చిత్రాలే ఉన్నాయి. ఇవే పాండమిక్ తర్వాత జనాలను థియేటర్లకు రప్పించాయి. మరోవైపు ఎన్నో అంచనాలు పెట్టుకున్న హిందీ సినిమాలు మాత్రం దారుణంగా నిరాశపరిచాయి.
లేటెస్టుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ ఏడాది దేశీయ మార్కెట్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల జాబితాను ప్రచురించింది. దీని ప్రకారం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన టాప్-10 సినిమాలో 'కేజీఎఫ్: చాప్టర్ 2' ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
కన్నడలో యష్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''కేజీఎఫ్ 2'' సినిమా డొమెస్టిక్ లో రూ. 872.6 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ''ఆర్.ఆర్.ఆర్'' మూవీ రూ. 784.2 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన హిందీ సినిమా ''ది కాశ్మీర్ ఫైల్స్'' రూ. 248.2 కోట్లు వసూలు చేసింది. విజయ్ హీరోగా డైరెక్టర్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన 'బీస్ట్' మూవీ రూ. 139.8 కోట్లు రాబట్టింది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ''విక్రమ్'' సినిమా ఇప్పటి వరకు దేశీయంగా రూ. 124.6 కోట్లు రాబట్టింది. రాబోయే రోజుల్లో ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక కార్తీక్ ఆర్యన్ నటించిన హిందీ మూవీ ''భూల్ భూలయ్య 2'' సినిమా రూ. 152.8 కోట్లు సాధించింది.
మహేష్ బాబు హీరోగా పరశురాం పెట్లా దర్శకత్వంలో రూపొందిన ''సర్కారు వారి పాట'' చిత్రం రూ. 139.2 కోట్లు రాబట్టింది. అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ''గంగూబాయి కతియావాడి'' సినిమా రూ. 123.5 కోట్లు వసూలు చేసింది.
పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' మూవీ రూ. 114.5 కోట్లు కలెక్ట్ చేయగా.. అజిత్ కుమార్ నటించిన 'వాలిమై' సినిమా రూ. 104.3 కోట్లు రాబట్టినట్లు మీడియా సంస్థ తమ నివేదికలో తెలిపింది.
టాప్-10 లో మూడేసి తెలుగు తమిళ హిందీ చిత్రాలు.. ఒక కన్నడ సినిమా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ఏడాది ఇప్పటి వరకు హయ్యెస్ట్ కలెక్టన్స్ సాధించిన చిత్రాల్లో ఏడు సౌత్ సినిమాలు ఉంటే.. మూడు మాత్రమే హిందీ మూవీస్ ఉన్నాయి. దీనిని బట్టి ప్రస్తుతం బాలీవుడ్ పై సౌత్ సినిమా డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో స్పష్టంగా తెలుస్తుంది.
అంతేకాదు పాన్ ఇండియా చిత్రాలు మరియు యాక్షన్ అంశాలతో కూడిన సినిమాలు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయనేది అర్థం అవుతోంది. కరోనా పాండమిక్ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కు అలవాటు పడిపోయిన జనాలు.. లార్జర్ థెన్ లైఫ్ సినిమాను చూడటానికే థియేటర్లకు వస్తున్నారని తెలుస్తోంది. మరి రాబోయే ఆరు నెలల్లో ఏయే సినిమాలకు ప్రేక్షకాదరణ లభిస్తుందో చూడాలి.