Begin typing your search above and press return to search.
సౌత్ ఇండియన్ హీరోస్ టూ కాస్ట్లీ గురూ
By: Tupaki Desk | 15 May 2022 12:30 AM GMTదక్షిణాది చిత్ర సీమలో కొత్త ట్రెండ్ మొదలైంది. మన వాళ్ల సినిమాలు దేశ వ్యాప్తంగా ఆడుతుండటం, డబ్బింగ్ రైట్స్ విషయంలోనూ భారీగానే రేటు పలుకుతుండటంతో క్రేజీ స్టార్ ల నుంచి చిన్న హీరోల వరకు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. పెరిగిన మార్కెట్, సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్ లు కూడా స్టార్ హీరోల డిమాండ్ కి తగ్గట్టే పారితోషికాలు ఇవ్వడబానికి రెడీ అవుతున్నారు. కొంత మంది ప్రొడ్యూసర్ లు ఈ విషయంలో పోటీలు పడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది. స్టార్ తో కెరీర్ ఓ ఒక్క బ్లాక్ బస్టర్ కొడితే లైఫ్ సెటిల్ అన్నది ఇప్పడు నిర్మాతలలో బలంగా నాటుకుపోవడంతో స్టార్ లకు అడిగినంతా ఇచ్చేస్తూ భారీ సినిమాలని సెట్ చేస్తున్నారు.
ఈ వరుసలో దక్షిణాదిలో వున్న చాలా మంది స్టార్లు యమ్ కాస్ట్లీ అనిపించుకుంటున్నారు. దాదాపు పది మంది హీరోల వరకు సౌత్ లో తమ రెమ్యునరేషన్ లతో షాకిస్తున్నారు. ఊహించని విధంగా ఒక్కో సినిమాకు పారితోషికాలని సొంతం చేసుకుంటూ సౌత్ లో టాప్ తామే అని నిరూపించుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 45 కోట్ల నుంచి 100 కోట్లకు మించి వసూలు చేస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. ఆ హీరోలెవరో వారి రెమ్యునరేషన్ ల కథేంటో ఒక సారి చూద్దాం.
ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచారు తమిళ హీరో దళపతి విజయ్. తమిళనాట ఈ హీరోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్న విజయ్ ఒక్కో సినిమాకు 100 కోట్లకు మించే పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆ మధ్య లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేసిన 'మాస్టర్' చిత్రానికే విజయ్ 100 కోట్లు డిమాండ్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే 'మాస్టర్' 80 కోట్లు తీసుకున్న విజయ్ ఆ తరువాత సినిమాకు 100 కోట్లు డిమాండ్ చేశారట. సన్ పిక్చర్స్ బ్యానర్ లో విజయ్ 'బీస్ట్' మూవీ చేసిన విషయం తెలిసిందే. దీనికి 100 కోట్లు తీసుకున్నాడని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం వంశీ పైడిపల్లి చిత్రానికి 118 కోట్లు అడుగుతున్నాడని అంటున్నారు.
ఇక విజయ్ తరువాత స్థానంలో హీరో అజిత్ నిలిచాడు. ఇటీవల హెచ్. వినోద్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన 'వలిమై'లో నటించారు అజిత్. ఈ చిత్రానికి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన ఈ మూవీకి భారీగానే పారితోషికం తీసుకున్న అజిత్ తన 62వ చిత్రానికి మాత్రం 100 కోట్లు కోట్ చేసినట్టు చెబుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అజిత్ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ 100 కోట్లకు మరో 5 చేర్చి 105 కోట్లు ఇచ్చారట.
అత్యధిక రెమ్యునరేషన్ సొంతం చేసుకున్న హీరోల్లో ముందు ముందు వరుసలో నిలిచిన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం సన్ పిక్చర్స్ నిర్మించనున్న సినిమాని కమిట్ అయ్యారు. 'బీస్ట్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇది రజనీ 169వ చిత్రం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ మూవీకి రజనీ అందుకుంటున్న పారితోషికం అక్షరాలా 100 కోట్లట. ఆ తరువాత స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 80 నుంచి 85 కోట్లు తీసుకుంటున్నారట. బాహుబలికి ముందు ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్లు మాత్రమే తీసుకున్న ప్రభాస్ ఇప్పడు పారితోషికాన్ని భారీగా పెంచేశాడు.
మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ 64 కోట్లు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 50 నుంచి 70 కోట్లు.. మహేష్ బాబు 50 నుంచి 80 కోట్లు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ 45 నుంచి 50 కోట్లు..అల్లు అర్జున్ 40 కోట్లు.. కేజీఎఫ్ స్టార్ యష్ 20 కోట్లు.. అయితే పార్ట్ 3కి ఈ రేటు మరింతగా పెరగడమో డబుల్ కావడమో జరుగుతుందని చెబుతున్నారు. ఈ లెక్కలు చూసిన వారంతా దక్షిణాది స్టార్స్ టూ కాస్ట్లీ గురూ అంటున్నారు.