Begin typing your search above and press return to search.
ఫ్రీడమ్ ఫైటర్స్ పై పడిన సౌత్ ఇండస్ర్టీ!
By: Tupaki Desk | 19 Aug 2022 10:30 AM GMTదక్షిణాది పరిశ్రమలోనూ బయోపిక్ ల ట్రెండ్ మొదలైంది. మారుతోన్న ప్రేక్షకుల అభిరుచి మేరకు ప్రముఖలు జీవితాల్ని వెండి తెరకి ఎక్కుతోన్న వైనం పెరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో స్వాతంత్ర్య సమరయోధుల జీవిత కథలపై సౌత్ పరిమశ్రమ మరింతగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాంధీ..గాడ్సే జీవితాల్ని తెరపైకి ఎక్కించారు.
ఇటీవలే 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంతో పాన్ ఇండియాలో గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రని..మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రల్ని డ్రెమటైజ్ చేసిన విధానం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇందులో జీవిత కథల్ని కాకుండా కేవలం పాత్రల పేర్లును మాత్రమే తీసుకుని ఆద్యంతం రక్తి కట్టించారు.
ఇక స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆనంధ్ మఠ్ నవల ఆధారంగా '1770' అనే కథకి ఆజ్యం పోసారు. ఈ కథ ద్వారా కొంత మంది స్వాతంత్ర్య సమర యోధుల్ని తెరపైకి తీసుకొచ్చే ప్ర యత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి అశ్వీన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియాలో ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాన్సెప్ట్ టీజర్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇందులో పాత్రధారుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా తమిళ నటుడు మాధవన్ మరో సమరయోధుడికి కథకి పూనుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన సమర యోధుడు చంపాకరమన్ పిల్లై జీవితం ఆధారంగా ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో చంపాకరమన్ పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. రాజేష్ అనే కొత్త కుర్రాడు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
తొలుత ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో తెరకెక్కిస్తారు. అటుపై భారతీయ భాషలన్నింటిలోకి అనువదించనుట్లు సమాచారం. ఈ సందర్భంగా సినిమా విశేషాల్ని దర్శకుడు పంచుకున్నారు.'' నాలుగేళ్లగా చంపాకరమన్ జీవితంపై పరిశోధన సాగింది. స్ర్కిప్ట్ చివరి దశకు చేరుకుంది. కథ సిద్దంగా కాగానే ఫోన్ చేసి విషయం చెప్పగానే చేస్తానని ముందుకొచ్చారు. త్వరలోనే సినిమాని బెర్లిన్..స్విట్జర్లాండ్..జర్మనీ తదితర దేశాల్లో చిత్రీకరణ చేస్తామని'' తెలిపారు.
ఇటీవలే మాధవన్ ఇండియన్ ఎరోస్సేస్ సైంటిస్ట్.. పద్మభూషణ్ నంబీ నారాయణ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్' టైటిల్ తో రిలీజ్ అయిన సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాతో మాధవన్ కి నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది.ఈ క్రమంలోనే మరో బయోపిక్ తో మాధవన్ తెరపైకి రావడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.