Begin typing your search above and press return to search.

2023 ఫ‌స్టాఫ్ నార్త్ లో సౌత్ బాద్ షా ఎవ‌రు?

By:  Tupaki Desk   |   3 Jan 2023 2:30 AM GMT
2023 ఫ‌స్టాఫ్ నార్త్ లో సౌత్ బాద్ షా ఎవ‌రు?
X
2023 ప్రథమార్థంలో విడుదల కోసం ఎదురుచూస్తున్న దక్షిణ భారత సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే... ఐదారు భారీ చిత్రాలు ప్ర‌ధానంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అభిమానుల్లోను విస్త్ర‌తంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వీటిపై సోష‌ల్ మీడియాల్లో బోలెడంత హైప్ నెల‌కొంది. ఇటీవ‌ల ఉత్త‌రాది ఆడియెన్ సౌత్ స్ట‌ఫ్ కోసం ఆస‌క్తిగా వేచి చూస్తుండ‌డంతో వీళ్ల‌లో ఎవ‌రు ఉత్త‌రాదిని కొల్లగొడ‌తారు? అన్న టాక్ కూడా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

గ‌త ఏడాది ఆర్.ఆర్.ఆర్-పుష్ప లాంటి భారీ తెలుగు చిత్రాలు సంచ‌ల‌న విజయం సాధించి మ‌న మార్కెట్ కి ఉత్త‌రాదిన ఊపు తెచ్చాయి. అదే హుషారులో ఏడాది మిడిల్ లో విడుద‌లైన నిఖిల్ మీడియం బ‌డ్జెట్ సినిమా `కార్తికేయ 2` యూనివ‌ర్శ‌ల్ కంటెంట్ తో బంప‌ర్ హిట్టు కొట్టేసింది. దీంతో ఉత్త‌రాది క‌రెన్సీ వాస‌న‌ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి గ‌ట్టిగా ప‌ట్టేసింది. ఇదే అనువుగా ఆనుపానుల‌ను ప‌సిగట్టి ఈ క్ష‌ణం నార్త్ ని కొల్ల‌గొట్టాల‌న్న పంతం పెరిగింది. కొంద‌రు హీరోలు ఫిలింమేక‌ర్స్ ఉత్త‌రాది బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేయాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

2022 సంవత్సరాన్ని ఘ‌నంగా ముగించి కొత్త ఏడాదిలో అడుగుపెట్టాం. గ‌త ఏడాది అనేక సౌత్ సినిమాలు సూపర్ హిట్ లు కొట్ట‌డం ఇప్పుడు మ‌రింత విశ్వాసాన్ని పెంచింది. 2023 లైనప్ లో మరిన్ని క్రేజీ సౌత్ సినిమాలు రేసులో ఉన్నాయి. వీటిలో తెలుగు నుంచి వాల్తేరు వీర‌య్య(చిరు)- వీర‌సింహారెడ్డి(ఎన్బీకే) కూడా ఉత్త‌రాది బ‌రిలో ఉంటాయ‌ని టాక్‌ వినిపిస్తోంది. అటు త‌మిళం నుంచి వారిసు(విజ‌య్‌)- తునివు (అజిత్‌) బ‌రిలో ఉన్నాయి. వీటితో పాటు 2023 ప్రథమార్థంలో విడుదల కానున్న దక్షిణ భారత సినిమాల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే..

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న `హరి హర వీర మల్లు` సౌత్ నుంచి మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో నిలిచింది. ఈ హిస్టారిక‌ల్ జాన‌ప‌ద‌ యాక్షన్ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. ప‌వ‌న్ కి ఇది తొలి పాన్ ఇండియా రిలీజ్ కానుండ‌డంతో అభిమానుల్లో బోలెడంత హంగామా నెల‌కొంది. ముఖ్యంగా ప‌వ‌న్ దండ‌యాత్ర ఉత్త‌రాదినా కొన‌సాగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

జైలర్ - వాతి

సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉత్త‌రాదినా భారీ ఫాలోయింగ్ ఉంది. అత‌డు నటించిన `జైలర్` ఈ ఏడ‌ది ప్ర‌థ‌మార్థంలో అంటే ఏప్రిల్ 2023లో విడుదల కానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని స‌మాచారం. ద‌ర్బార్ త‌ర్వాత జైల‌ర్ ర‌జ‌నీ న‌టించిన క్రేజీ మూవీగా విడుద‌ల కానుంది. ధనుష్ న‌టిస్తున్న‌ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం `వాతీ` (సర్) ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ధ‌నుష్ ఇప్ప‌టికే బాలీవుడ్ లో పేరున్న న‌టుడు కావ‌డంతో హిందీ వెర్ష‌న్ భారీగా విడుద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

పొన్నియిన్ సెల్వన్ 2

మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన తమిళ చిత్రం `పొన్నియిన్ సెల్వన్` గ‌త ఏడాది పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు రెండో భాగంపై భారీ హైప్ నెల‌కొంది. 2023 ఏప్రిల్ 28న పార్ట్ 2 విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ సీక్వెల్ లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ - త్రిష కృష్ణన్-జయం రవి-చియాన్ విక్రమ్- కార్తీ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. పార్తీబన్ రాధాకృష్ణన్- శరత్‌కుమార్- ప్రకాష్ రాజ్ వంటి టాప్ తారాగ‌ణం అద‌న‌పు బలం.

బాలీవుడ్ లో పాగా వేయాల‌ని చాలా కాలంగా ప్ర‌య‌త్నిస్తున్న ఇద్ద‌రు త‌మిళ హీరోలు విజ‌య్ - అజిత్ కి ఇప్పుడు మ‌రో అవ‌కాశం ముందుంది. వారిసు -తునీవు హిందీ వెర్ష‌న్ల‌తో ఉత్త‌రాదిన హ‌వా సాగించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. 2023 సంవత్సరం ఆరంభ‌మే బాక్సాఫీస్ వద్ద మెగా క్లాష్ తో ప్రారంభమవుతోంది. తమిళనాడులో ఇద్ద‌రు అగ్ర న‌టులు అజిత్ కుమార్ - విజయ్ పొంగల్ రేసులో పోటీప‌డుతుండ‌డంతో దీనిపై ఉత్త‌రాది ట్రేడ్ లోను చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాల్లో వారిసు (వార‌సుడు) చిత్రానికి తెలుగు దర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వారిసు జనవరి 12న తెలుగు-త‌మిళంలో ఘ‌నంగా విడుదల కానుంది. హిందీలోను విడుద‌ల‌వుతుందని స‌మాచారం. మరోవైపు అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన -తునివు జనవరి 11 న విడుదలకు సిద్ధమవుతోంది. మంజు వారియర్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. బ్యాంక్ దోపిడీ నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించే మాస్ యాక్ష‌న్ చిత్ర‌మిది. యూనివ‌ర్శ‌ల్ యాక్సెప్టెన్సీ ఉన్న చిత్ర‌మిద‌ని తునివు ట్రైల‌ర్ నిరూపించ‌డంతో అభిమానుల్లో హైప్ నెల‌కొంది.

వీర‌య్య వ‌ర్సెస్ వీర‌సింహారెడ్డి

నిజానికి టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రంజైన పోటీ సాగ‌నుంది. టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి... న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సంక్రాంతి పుంజుల్లా పండ‌గ బ‌రిలో దిగుతున్నారు. చిరు -వాల్తేరు వీరయ్య .. బాల‌కృష్ణ - వీర సింహారెడ్డి రెండూ మాస్ ని ఎంట‌ర్ టైన్ చేసే చిత్రాలు. వీటికి ఉత్త‌రాదిన శాటిలైట్ డిజిట‌ల్‌ హ‌క్కుల ప‌రంగా బోలెడంత డిమాండ్ నెల‌కొంది. ఈ రెండు మాస్ చిత్రాల‌ను ఉత్త‌రాదినా థియేట్రిక‌ల్ గా ఎంపిక చేసిన థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తార‌ని టాక్ ఉంది. అలాగే దేశంలో అన్ని మెట్రో న‌గ‌రాల్లోను విడుద‌ల కానున్నాయి. ఈ రెండిటిలో చిరు.. బాల‌య్య స‌ర‌స‌న‌ యాధృచ్ఛికంగా శృతి హాసన్ క‌థానాయిక కావ‌డం ఉత్త‌రాదిన కొంత ప్ల‌స్ అవుతుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ రెండు భారీ చిత్రాల‌ను తెర‌కెక్కించింది. వాల్తేర్ వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. బాబి అలియాస్ కెఎస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వీర‌సింహారెడ్డి జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుండ‌గా దీనికి గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఉత్త‌రాదిన మాస్ స్ట‌ఫ్ కి గౌర‌వం పెరిగినందున ఈ రెండు సినిమాలు అక్క‌డా రాణిస్తాయ‌నే అభిమానులు భావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.