Begin typing your search above and press return to search.

బాలీవుడ్ పై సౌత్..దెబ్బ మామూలుగా లేద‌బ్బా!

By:  Tupaki Desk   |   7 July 2022 11:30 PM GMT
బాలీవుడ్ పై సౌత్..దెబ్బ మామూలుగా లేద‌బ్బా!
X
ఏడాది కాలంలో బాలీవుడ్ పై సౌత్ సినిమా హ‌వా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో చూస్తునే ఉన్నాం. బ్యాక్ టూ బ్యాక్ ద‌క్షిణాది సినిమాలు పాన్ ఇండియా కేట‌రిగిరీలో రిలీజ్ అయి హిందీ మార్కెట్ ని సైతం దున్నేస్తున్నాయి. సౌత్ దెబ్బకి నార్త్ సినిమాలు థియేట‌ర్లో నిలబ‌డ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఆ రేంజ్ లో సౌత్ సినిమాలు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్లో ప్ర‌భావాన్ని చూపించాయి.

ఖాన్ లు-క‌పూర్ లు పోటీలో లేక‌పోవ‌డం స‌హా కంటెంట్ బేస్డ్ సినిమాలు కావ‌డంతో? బాక్సాఫీస్ వ‌ద్ద కోట్ల వ‌ర్షం కురిపించాయి. 2021-22 ట్రేడ్ విశ్లేషిస్తే ఈ విష‌యం అర్ధ‌మ‌వుతుంది. టాప్ -10 చిత్రాల్లో 6 సినిమాలు సౌత్ నుంచే అగ్ర స్థానాల్లో కొన‌సాగ‌డం విశేషంగా చెప్పొచ్చు. 'కేజీఎఫ్' చాప్ట‌ర్-2..1228 కోట్ల వ‌సూళ్ల‌తో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది.

ఇక ఆ త‌ర్వాత 'ఆర్ ఆర్ ఆర్' 1131 కోట్ల వ‌సూళ్ల‌తో రెండ‌వ స్థానంలో నిలిచింది. ఈ రెండు సినిమాల మధ్య‌ వ‌సూళ్ల వ్య‌త్యాసం 100 కోట్లు తేడా ఉన్నా..గ్లోబ‌ల్ స్థాయిలో 'ఆర్ ఆర్ ఆర్' కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్క‌డంతో తెలుగు సినిమా ఖ్యాతి మ‌రోసారి ఖ్యాతికెక్కింది. ఇక మూడ‌వ స్థానంలో విక్ర‌మ్ నిలిచింది. ఈ సినిమా 400 కో ట్ల వ‌సూళ్ల‌ని సాధించి కోలీవుడ్ కి పెద్ద స‌క్సెస్ ని అందించింది.

నాల్గ‌వ స్థానంలో 'పుష్ప ది రైజ్' నిలిచింది. ఈ సినిమా 370 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించ‌డంతో స‌హా హిందీ బెల్ట్ లో భారీ వ‌సూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ సినిమా 'క‌శ్మీర్ ఫైల్స్' 345 కోట్లు..'సూర్య వంశీ' 292 కోట్లు..'భూల్ భుల‌య్యా -2'..264 కోట్లు..'గంగుబాయి క‌తియావాడి' 200 కోట్ల వ‌సూళ్ల‌తో త‌దుప‌రి స్థానాల్లో నిలిచాయి.

ఇక ఆ త‌ర్వాతి స్థానాల్లో 'స‌ర్కారు వారి పాట' 192 కోట్ల‌తో నిలిచింది. ఇవ‌న్నీ వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ క‌లెక్ష‌న్స్. ఇలా మొత్తం ప‌ది సినిమాల్లో ఆరు సినిమాలు ద‌క్షిణాది నుంచి ఉండ‌టం విశేషం. ఒక‌ప్పుడు తెలుగు సినిమా హిందీలో కేవ‌లం టీవీ రిలీజ్ డ‌బ్బింగ్ వ‌ర‌కూ ప‌రిమితం . కానీ నేడు తెలుగు సినిమా స్తా ఏంటి? అన్న‌ది బాలీవుడ్ కి తెలిసొచ్చింది.

ఇక్క‌డ కంటెంట్ అక్క‌డ రీమేక్ అవ్వ‌డం..అక్క‌డ స్టార్లు ఇక్క‌డ సినిమాల్లో భాగం అవ్వ‌డం వంటి స‌న్నివేశాల‌తో తెలుగు సినిమా ఏ స్థాయికి చేరుకుంద‌న్న‌ది అద్దం ప‌డుతుంది. భ‌విష్య‌త్ లో తెలుగు సినిమా ప్ర‌పంచ స్థాయి సినిమాకి ఏ మాత్రం తీసిపోద‌ని నిరూపించే రోజులు ద‌గ్గ‌ర్లోనే క‌నిపిస్తున్నాయి.