Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: స‌్టార్లు నో పాలిట్రిక్స్!

By:  Tupaki Desk   |   5 Feb 2019 4:28 AM GMT
టాప్ స్టోరి: స‌్టార్లు నో పాలిట్రిక్స్!
X
సినిమా - రాజ‌కీయం జోడు గుర్రాలు అన‌డంలో సందేహం లేదు. ఒక‌దానితో ఒక‌టి ముడిప‌డి ఉంటాయి. గ్లామ‌ర్ ప్ర‌పంచం లో అగ్ర హీరోలుగా వెలిగిన వారికి రాజ‌కీయాల్లో చ‌క్క‌ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల్లో స్టార్ల ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు రాజ‌కీయ పార్టీలు గాలం వేయ‌డం కొత్త ట‌ర్న్ తీసుకునేందుకు తావిస్తోంది. చ‌రిత్ర‌లో అనాదిగా వ‌స్తున్న సాంప్ర‌దాయ‌మే ఇది. ప్ర‌స్తుత అగ్ర హీరోల్లో చిరంజీవి - బాల‌కృష్ణ‌ - ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్ హాస‌న్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ - ఉపేంద్ర‌ .. ఇలా ఎంద‌రో దిగ్గ‌జాలు రాజ‌కీయాల్లో ఉన్నారు. అయితే అస‌లు రాజ‌కీయాల్లోకి రాలేమ‌ని క‌చ్ఛితంగా చెప్పే వాళ్లు ఎంద‌రు ఉన్నారు? అన్న‌ది వెతికితే ప‌దుల సంఖ్య‌లో పేర్లు వినిపిస్తున్నాయి.

అందులో ఓ ఐదుగురు టాప్ స్టార్ల పేర్ల‌ను క‌న్ఫామ్ గా రాజ‌కీయాల‌తో ముడి పెట్ట‌లేం. మోహ‌న్ లాల్ - మ‌హేష్ - నాగార్జున‌ - వెంక‌టేష్‌ - అల్లు అర్జున్ .... వీళ్లు క‌న్ఫామ్‌ గా ప్ర‌త్య‌క్ష‌ రాజ‌కీయాల్లోకి రారు అని చెప్ప‌గ‌లం. ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో స‌ద‌రు హీరోలు ఇచ్చిన స్టేట్ మెంట్లు ప‌రిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఇక ఇత‌ర హీరోలంద‌రికీ ఆల్మోస్ట్ పొలిటిక‌ల్ గా ట‌ర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. అది వెంట‌నే కాక‌పోయినా కాస్త లేటుగా అయినా అదే జ‌రుగబోతుంద‌నేది ఓ అంచ‌నా. నాగార్జున హీరోగా రాణిస్తున్నారు. యువ‌హీరోల్ని క‌లుపుకుని మ‌ల్టీస్టార‌ర్ల‌తో కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో కెరీర్ బండిని కొత్త పుంత‌లు తొక్కించే ప్లాన్ లో ఉన్నారు. పైగా త‌ను పూర్తిగా బిజినెస్ మైండెడ్.. అందువ‌ల్ల పూర్తి స్థాయిలో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాలేరు. అయితే ఆయ‌న త‌ర‌పున స్నేహితులు - బంధువులు రాజ‌కీయాల్లో ఉంటారు. నాయ‌కుల‌తో స‌త్సంబంధాల్ని నెర‌ప‌డంలో, స్నేహం చేయ‌డంలో కింగ్ సిద్ధ‌హ‌స్తుడు. అధికార తెరాస‌ - వైయ‌స్ జ‌గ‌న్ ల‌కు నాగార్జున అత్యంత స‌న్నిహితుడుగా ఉంటున్నారు. అలాగ‌ని ఆయ‌న నేరుగా రాజ‌కీయాల్లోకి రారు.. రాలేరు!

ఇక మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ రాజ‌కీయాల్లోకొస్తున్నారంటూ సాగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న కొట్టిప‌డేశారు. ఇప్ప‌ట్లో ఛాన్సే లేద‌ని అన్నారు. తిరువ‌నంత‌పురం (కేర‌ళ‌) నుంచి భాజ‌పా ఎమ్మెల్యేగా లాల్ చేత పోటీ చేయించాల‌న్న ప్ర‌య‌త్నానికి ఆయ‌న తెర దించేశారు. వివేకానందుని తాత్విక‌త‌ను అనుస‌రించే విక్ట‌రీ వెంక‌టేష్ రాజ‌కీయాల్లోకి రావ‌డం క‌ష్టం. ఆయ‌న దారే వేరు. మ‌హేష్ ఫ్యామిలీ నుంచి ప‌లువురు రాజ‌కీయాల్లో ఉన్నా సూప‌ర్ స్టార్ కృష్ణ మాత్రం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ప్ర‌శాంత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన జీవితం ముఖ్యం అనుకున్నారు. అదే దారిలో మ‌హేష్ వెళ‌తార‌న‌డంలో సందేహం లేదు. బావ గ‌ల్లా జ‌య‌దేవ్ రాజ‌కీయాల్లో ఉన్నా - త‌న‌కు ప్ర‌చారం ప‌రంగా అండ‌గా నిలుస్తాడు త‌ప్ప మ‌హేష్ నేరుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఛాన్సే లేదు. సినిమా రంగంలో అత‌డు త‌న నంబ‌ర్ 1 స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకోవాలి? అన్న‌దే ఆలోచిస్తున్నారు. ప‌వ‌న్ తేదేపాకు దూర‌మ‌వ్వ‌డంతో మ‌హేష్ ఛ‌రిష్మాని తేదేపా వాడుకోవాల‌నుకుంటోందనేది ఓ ప్ర‌చారం. మ‌హేష్‌ బాబాయ్ ఆదిశేష‌గిరిరావు తేదేపాలో చేరుతున్నార‌ని - ఆ చొర‌వ‌తో పార్టీ ప్ర‌చారానికి మ‌హేష్‌ ని పిల‌వాల‌ని తేదేపా భావిస్తోందంటూ ఇటీవ‌ల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మ‌హేష్ ట‌ర్న్ ఏంటి అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉందింకా. ఇక అల్లు అర్జున్ ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఛాన్స్ లేదు. ప్ర‌స్తుతం టాప్ స్టార్ల‌లో ఒక‌డిగా త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకోవ‌డ‌మే అత‌డి ఎత్తుగ‌డ‌. అయితే మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి త‌న‌వంతు సపోర్టు ఉంద‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. ఇది ప్ర‌చార సాయం వ‌ర‌కే.

చ‌ర‌ణ్‌ - ప్ర‌భాస్ - ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే సంద‌ర్భం ఇది కానేకాదు. ఒక‌వేళ రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటే.. చ‌ర‌ణ్ కి చిరు - ప‌వ‌న్ స్ఫూర్తి గా నిలుస్తారు. ప్ర‌భాస్ కి పెద‌నాన్న కృష్ణం రాజు స్ఫూర్తి. చ‌ర‌ణ్‌ - ప్ర‌భాస్ ప్ర‌స్తుతం హీరోలుగా కెరీర్ ప‌రంగా పీక్స్ ని చూస్తున్నారు. ఇక మ‌హేష్ కి బావ గ‌ల్లా జ‌య‌దేవ్ స్ఫూర్తి.. కానీ రాజ‌కీయాలంటే దూరం దూరంగానే ఉంటారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కి - తాత ఎన్టీఆర్ - టీడీపీ అంటే ప్రాణం. ఆ రెండూ త‌న‌కు స్ఫూర్తి. కానీ ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే మూడో లో లేడు.. ప్ర‌చారం వ‌ర‌కూ ఓకే. ఇక త‌మిళ హీరోలంతా రాజకీయాల్లో స్పీడున్నోళ్లే... అక్క‌డ అర‌డ‌జ‌ను పైగానే స్టార్ హీరోలు రాజ‌కీయంగా యాక్టివ్ గానే ఉన్నారు. విజ‌య్ - విశాల్ - అజిత్ వంటి స్టార్ల పేర్లు రాజ‌కీయాల‌తోనే ముడిప‌డి ఉంటాయి ఎప్పుడూ!!