Begin typing your search above and press return to search.
అమెరికాలో ఎస్పీబాలుకు చేదు అనుభవం
By: Tupaki Desk | 5 April 2017 8:00 AM GMTగానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఎస్పీబీ-50 పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలు తన పాస్‌పోర్ట్ తో పాటు క్రెడిట్ కార్డ్స్ - క్యాష్ మరియు ఐప్యాడ్ లాంటి విలువైన వస్తువులు పోగొట్టుకొట్టున్నట్టు తన ఫేస్ బుక్ పేజ్ లో తెలిపారు. హ్యూస్టన్ లోని భారతీయ రాయభార కార్యాలయం సాయంతో 24 గంటలలో డ్యూప్లికేట్ పాస్ పోర్ట్ పొందినట్టు వివరించారు. అయితే ఈ విషయంకు సంబంధించి సోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాను సేఫ్ గానే ఉన్నట్టు ఓ వీడియో ద్వారా తెలిపారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 2012 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కేటాయించడం పట్ల కూడా ఎస్పీ బాలు ఏపీ ప్రభుత్వానికి , జ్యూరీ సభ్యులకు, ముఖ్యంగా బాలయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక సంగీత సరస్వతి ఎస్. జానకి తన సంగీత ప్రయాణంలో 60 సంవత్సరాలు పూర్తి చేసినందుకు గాను ఆమెను అభినందిస్తూ తన జీవితంలో మరెన్నో పాటలు పాడాలని కోరాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/