Begin typing your search above and press return to search.
అత్యంత విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్యం
By: Tupaki Desk | 24 Sep 2020 5:31 PM GMTప్రముఖ తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత క్షీణించినట్టు ఆస్పత్రి వర్గాలు బులిటెన్ లో తెలిపాయి. . కరోనా వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆగస్టు 5న చెన్నై ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
గత 40 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలు చికిత్స పొందుతున్నారు. కిందట వారం బాలు ఆరోగ్యం మెరుగ్గా ఉందని బాలు కుమారుడు చరణ్ వెల్లడించారు. కరోనా కూడా నెగెటివ్ గా వచ్చిందని.. కుర్చీలో కూర్చుంటున్నారని కూడా తెలిపాడు.
అయితే ఎస్పీ బాలు కోలుకుంటుండగా.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.
కాగా బాల సుబ్రహ్మణ్య ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఎంజీఎం ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో ఎస్పీ బాలు ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఎస్పీ బాలుకు ఎక్మో, వెంటిలేటర్ ఇతర ప్రాణధార చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కాగా కోలుకున్నట్టే కోలుకొని మళ్లీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.