Begin typing your search above and press return to search.
ఎస్.పి.బాలు చివరి మాటలు వింటే ఏడుపు ఆపుకోలేరు!
By: Tupaki Desk | 25 Sep 2020 2:00 PM GMTగానగంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం కోవిడ్ 19కి చికిత్స పొందుతూ ఈ శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకున్నట్టే కోలుకుని ఇంతలోనే అనారోగ్యం తిరగబెట్టి మరణించడం అభిమానుల్ని కలవరపరిచింది. వైద్యులు ఎక్మోట్రీట్ మెంట్ తో చివరివరకూ ప్రయత్నించినా ఆయన బతకలేదు. మధ్యాహ్నం 1.04 గంటకు బాలు చనిపోయాడని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు. ఆ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టాలీవుడ్ గానగంధర్వుడికి అశ్రునయనాలతో సంతాపం ప్రకటించింది.
అదంతా సరే కానీ.. ఎస్.పి బాలు మరణానికి ముందు చివరి వీడియోని రూపొందించారు. ఆ వీడియో చూసిన ఎవరికైనా ఏడుపు ఆగదు. అంతగా ఆయన మాటలు కలచివేస్తాయి. ఇంతకీ ఏమన్నారంటే.. కోవిడ్ మైల్డ్ గా ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలని.. సీరియస్ అయితేనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అలాగే తన ఆరోగ్యం మెరుగవుతోందని మరో రెండు రోజుల్లోనే బయటకు వచ్చేస్తానని కూడా ఆయన అనడం చూస్తుంటే ఆయనలో హోప్ .. సంకల్ప బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
2-3 రోజులుగా అంత సౌకర్యంగా లేను. నా ఛాతీ కండీషన్ అంత బాలేదు. జలుబు దగ్గు జ్వరం ఉన్నాయి. నాకు మైల్డ్ కండీషన్ అయినా కానీ ఇంట్లోనే ఉండకుండా ఆస్పత్రిలో చేరాను. మందులు తీసుకుంటున్నా. ఆస్పత్రి వైద్యులు స్నేహితులు బాగా చూసుకున్నారు. నా ఆరోగ్యం బానే ఉంది. ఎవరూ బాధపడొద్దు. నేను ఇక్కడికి రావడంపై బాధపడొద్దు.. నాకు కాల్ చేసే ప్రయత్నం చేయొద్దు! జ్వరం తప్ప అంతా బాగానే ఉన్నాను!! అని బాలు అన్నారు. డిస్ట్రబ్ చేయొద్దు అని ఆయన వీడియోలో కోరారు. కానీ ఇంతలోనే బాలు మరణించారన్న వార్త షాకిచ్చింది. నిజానికి నిన్నటి రాత్రి సమయంలోనే వైద్యులు బాలు ఆరోగ్యంపై పెదవి విరిచారన్న సమాచారం కూడా లభించింది.