Begin typing your search above and press return to search.
గౌతమీపుత్రుడి కోసం గాన గంధర్వుడి పాట
By: Tupaki Desk | 29 Nov 2016 5:30 PM GMTఎస్పీ బాలసుబ్రమణ్యం.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గొప్పదనమేంటో దేశంలో ఏ దిక్కుకు వెళ్లి అడిగినా చెబుతారు. తమిళం.. హిందీ లాంటి భాషల్లోనూ ఓ దశలో అగ్ర గాయకుడిగా వెలుగొందాడు ఈ గాన గంధర్వుడు. ఐతే గత రెండు దశాబ్దాల్లో ఆయన పాటలు బాగా తగ్గించేశారు. అందులోనూ గత నాలుగైదేళ్లో బాలు పాటే వినిపించట్లేదు ఎక్కడా. ఎప్పుడైనా ఆయన ఒక పాట పాడితే ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. సంగీత దర్శకులూ ఆయనకు పాటలివ్వట్లేదు. అదే సమయంలో మామూలు పాటలేవైనా ఇస్తే ఆయన పాడట్లేదు. ఇలాంటి టైంలో తెలుగులో రాబోయే ఒక ప్రముఖ సినిమాలో బాలు పాట పాడుతుండటం ఆసక్తి రేకెత్తించే విషయం.
నందమూరి బాలకృష్ణ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలు ఓ పాట పాడారు. సినిమాలో అది అత్యంత కీలకమైన పాట అట. ఈ మధ్యే ఆ పాటను సంగీత దర్శకుడు చిరంతన్ భట్ రికార్డు చేశాడు. ఆ సమయంలో క్రిష్ కూడా పక్కనే ఉన్నాడు. ముగ్గురూ కలిసి ఫొటో దిగి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంతమంది గాయకులు వచ్చినా.. ఎలా హవా సాగించినా.. చారిత్రక నేపథ్యం ఉన్న.. భాషకు ప్రాధాన్యం ఉన్న పాటలు పాడాలంటే ఇప్పటికే బాలూనే ఫస్ట్ ఛాయిస్. చిరంతన్ భట్ కూడా ఆ సంగతి గుర్తించే బాలుతో పాట పాడించాడు. ఈ చిత్ర ఆడియో డిసెంబరు 16న విడుదల కానుంది. ఆ రోజు గాన గంధర్వుడి పాట ఎలా వింటుందో విందాం మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/