Begin typing your search above and press return to search.

ఇళ‌య‌రాజా మీద పంచ్ వేసిన బాలు

By:  Tupaki Desk   |   11 April 2017 3:31 AM GMT
ఇళ‌య‌రాజా మీద పంచ్ వేసిన బాలు
X
తాను స్వ‌ర‌ప‌రిచిన పాట‌ల్ని వాణిజ్య అవ‌స‌రాల కోసం వినియోగిస్తే.. త‌న‌కు రాయ‌ల్టీ చెల్లించాల‌న్న వాద‌న‌ను ప్ర‌ముఖ సంగీత‌ద‌ర్శ‌కులు ఇళ‌య‌రాజా చెప్ప‌టం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. భారీ ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఫారిన్ టూర్ లో బాలు త‌న పాట‌ల్ని పాడే అంశంపై ఇళ‌య‌రాజా రియాక్ట్ అయి.. నోటీసులు పంపటం.. దానికి ఆయ‌న ఇచ్చిన రిప్లై భారీ చ‌ర్చ‌కే తెర తీసింద‌ని చెప్పాలి. తాను స్వ‌ర‌ప‌రిచిన పాట‌ల్ని పాడొద్ద‌ని ఆయన ఆఫీస్ నుంచి నాకొక్క ఫోన్ చేసినా బాగుండేద‌ని.. తాను పాడేవాడిని కాద‌ని.. ఇంత వివాదం అయి ఉండాల్సింది కాదన్న బాబు.. ఇప్ప‌టికి తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని.. త‌మ మ‌ధ్య‌నున్న స్నేహం చెడిపోదంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే.

ఇళ‌య‌రాజా వ‌ర్సెస్ బాలు ఎపిసోడ్‌లో రెండు వ‌ర్గాలుగా చీలిపోయారు. కొంద‌రు ఇళ‌య‌రాజాను స‌మ‌ర్దిస్తే.. మ‌రికొంద‌రు బాలును స‌మ‌ర్దిస్తూ మాట్లాడారు. దీంతో ఈ ఇష్యూ మీద తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. ఇళ‌య‌రాజా నోటీసుల‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన బాలు.. అంత‌లోనే రియాక్ట్ అయి.. ఈ ఇష్యూను మ‌రో స్టేజ్ కి తీసుకెళ్లారు. ఓ పాట వెనుక‌చాలామంది క‌ష్టం ఉంటుంద‌ని.. ద‌ర్శ‌కుడు.. నిర్మాత‌.. సంగీత ద‌ర్శ‌కుడు.. సింగ‌ర్‌.. వాయిద్య‌కారులు ఇలా చాలామందేఉంటార‌ని.. అలాంట‌ప్పుడు హ‌క్కులు మొత్తం సంగీత‌ద‌ర్వ‌కుడికి ఇవ్వాల‌న‌టం స‌రికాద‌ని.. అంద‌రూ క‌లిసిక‌ట్టుగా శ్ర‌మిస్తేనే సినిమా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని.. సినిమాలో ఒక స‌న్నివేశ‌మైనా.. పాట అయినా.. దాని వెనుక స‌మిష్ఠి క‌ష్టం ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని.. తాను చెప్పాల్సిన మాట‌ను చెప్పేశారు.

బాలు తాజా వ్యాఖ్య‌లు చూస్తే.. ఇళ‌య‌రాజాకు కాస్తంత గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చేసిన భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. అన్ని విష‌యాల్లో అపార‌మైన జ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించే ఇళ‌య‌రాజా.. పాట ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికిగా ఆయ‌న మాట్లాడే మాట‌లు.. రాయ‌ల్టీ ప్ర‌స్తావ‌న ఇప్పుడు విస్తృత‌మైన చ‌ర్చ‌కు దారి తీస్తోంది. సంగీతంలో అద్భుత‌మైన జ్ఞానసంప‌ద ఆయ‌న సొంతం. అలాంటి ఇళ‌య‌రాజా.. నా పాట నువ్వు పాడొద్దంటూ వ్యాఖ్యానించ‌టంతోనే అస‌లు స‌మ‌స్య‌. రాయ‌ల్టీ.. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు రెండింటిని ఒక త్రాసులో వేస్తే.. కీర్తి ప్ర‌తిష్ఠ‌ల ముందు రాయ‌ల్టీ చిన్న‌బోతుంది. మ‌రి.. అలాంట‌ప్పుడు రాయ‌ల్టీ అనే చిన్న మాట‌ను ప‌ట్టుకొని అంత పెద్ద ఇళ‌య‌రాజా.. చిన్న‌వాడిగా మార‌టంపై పలువురు పెద‌వి విరుస్తున్నారు. మ‌రీ.. విష‌యాన్ని ఇళ‌య‌రాజా కాస్త సుదీర్ఘంగా ఆలోచిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నా పాట నాకు మాత్ర‌మే సొంతం అన‌టంపై పాట పాడిన వారి ద‌గ్గ‌ర నుంచి ఆ పాట‌ను ప్రొడ్యూస్ చేయ‌టానికి పెట్టుబ‌డి పెట్టిన వాడి ముచ్చ‌టేంది? వారెందుకు రాయ‌ల్టీ రేసులోకి రారు? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.