Begin typing your search above and press return to search.
వర్మ అస్సలు తగ్గట్లేదుగా!
By: Tupaki Desk | 13 Nov 2018 6:26 AM GMTఒకపక్క క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. రెండు భాగాలూ కలిపి ఓ పాతిక శాతం మినహాయించి మొత్తం అయిపోయిందని ఇన్ సైడ్ టాక్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగవంతం చేసి సంక్రాంతికి సాఫీ రిలీజ్ ని ప్లాన్ చేసుకోవడంతో పాటు ప్రమోషన్ కోసం కావల్సినంత టైం ఉండేలా సెట్ చేస్తున్నాడట క్రిష్. ఇదిలా ఉంటే దీనికి పోటీగా అన్నట్టు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మిస్ ఎన్టీఆర్ గురించి అఫీషియల్ అప్ డేట్ లేదు కానీ లోలోపల బ్యాక్ గ్రౌండ్ వర్క్ మాత్రం జరిగిపోతున్నట్టు తెలిసింది.
కోరి మరీ ఎన్టీఆర్ కు సంగీతం అందిస్తున్న కీరవాణికి పోటీగా ఆయన తమ్ముడు కళ్యాణి మాలిక్ ను లక్ష్మిస్ ఎన్టీఆర్ కోసం తెచ్చుకున్న వర్మ ఓ పాట కోసం సుప్రసిద్ధ గాయకులు ఎస్పి బాలసుబ్రమణ్యంతో పాడించబోతున్నాడట. వర్మ ఆస్థాన గీత రచయిత సిరాశ్రీ రాసిన ఈ గీతం రికార్డింగ్ జరగబోతోందని టాక్. ఒకప్పుడైతే బాలు పాడటం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. వర్మ శివ మొదలుకుని రంగేళి దాకా చాలా సినిమాల్లో బాలు పాడారు. కానీ ఇప్పుడు మాత్రం పాటలో ఏదో ఒక ప్రత్యేకత లేనిదే ఆయన తన గొంతును ఏ సంగీత దర్శకుడికీ ఇవ్వడం లేదు. మరి వివాదాస్పద కథాంశంతో రూపొందుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఓ పాటకు ఓకే చెప్పడం అంటే విశేషమే. దీని పట్ల టీమ్ కూడా ఎగ్జైట్ అవుతోంది.
నటీనటుల ఎంపిక పూర్తి చేసిన వర్మ లక్ష్మి పార్వతిగా ఎవరు నటించబోతున్నారు అనే లీక్ మాత్రం బయటికి రానివ్వడం లేదు వర్మ. నారా చంద్రబాబునాయుడు పాత్రకు సోషల్ మీడియా సహాయంతో నటుడిని సెట్ చేసుకున్న వర్మ మరి ఎన్టీఆర్ తో పాటు ఆయన వారసులుగా ఇందులో ఎవరిని చూపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటనకు మాత్రమే కట్టుబడిన ప్రాజెక్ట్ కాదని అన్నట్టుగానే జనవరిలోనే విడుదల చేసేలా టైంకి పూర్తి చేస్తానని చెప్పిన వర్మ అన్నంత పని చేసేలాగే ఉన్నాడు.