Begin typing your search above and press return to search.
4kల గోల అక్కడ కూడా మొదలైంది!
By: Tupaki Desk | 30 Nov 2022 1:30 AM GMTతెలుగులో 4కె ప్రింట్ ల గోల మొదలైన విషయం తెలిసిందే. అభిమాన స్టార్ హీరోల కెరీర్ లని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ సినిమాలని మళ్లీ రీ మాస్టర్ చేసి 4కెలో రీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా విడుదలైన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఫ్లాప్ సినిమాలతో పాటు క్రేజీ సినిమాలని కూడా రీ రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. కేవలం స్టార్ హీరోల పుట్టిన రోజులని టార్గెట్ చేస్తూ అభిమానుల్ని ఖుషీ చేయాలనే ఉద్దేశ్యంతో మొదలైన ఈ పరంపర ఇప్పడు కాసుల వేటకు మరో మార్గంగా మారింది.
దీంతో చాలా వరకు స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాలని కూడా రీ మాస్టర్ చేసి రీ రిలీజ్ చేయడం ప్రారంభించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ `పోకిరి`తో 4కె ప్రింట్ ల రీ రిలీజ్ ల హంగామా టాలీవుడ్ లో మొట్ట మొదటి సారి మొదలైంది. ఆ తరువాత పవన్ కల్యాణ్ `జల్సా`.. ప్రభాస్ రెబల్, వర్షం, బిల్లా.. నందమూరి బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` వంటి సినిమాలు రీ మాస్టర్ చేసి 4కెలో రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
త్వరలో సూపర్ స్టార్ కృష్ణ నటించి తెరకెక్కించిన సంచలన చిత్రం `సింహాసనం` 8కెలో రాబోతోంది. ఇక ఇదే బాటలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `బాబా` మూవీని కూడా రీ మాస్టర్ చేసి 4కెలో తమిళ, తెలుగు భాషల్లో రజనీ పుట్టిన రోజైన డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ రేసులో మలయాళ సినిమాలు కూడా చేరబోతున్నాయి.
ముందుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన `స్పటికం`ని 4కెలోకి రీ మాస్టర్ చేసి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ లో రీరిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 28 ఏళ్ల తరువాత ఈ మూవీని రీరిలీజ్ చేస్తుండటం విశేషం. 1995లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డుని సాధించింది.
కేరళ స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ తో పాటు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని మోహన్ లాల్ సొంతం చేసుకున్న ఈ మూవీని 2023 ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రీరిలీజ్ చేయబోతున్నారు. మంగళవారం ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో మోహన్ లాల్ పంచుకున్న `స్పటికం` పోస్టర్ నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.