Begin typing your search above and press return to search.

బాలు అమ్మ విగ్రహం కోరిక కూడా తీరలేదు

By:  Tupaki Desk   |   28 Sept 2020 8:15 AM IST
బాలు అమ్మ విగ్రహం కోరిక కూడా తీరలేదు
X
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి మృతి తర్వాత ఆయన చేయాలనుకున్న పలు పనుల విషయంలో మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ నాన్నకు ప్రేమతో సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ ను పాడాలని ఆయన చాలా కోరుకున్నారు. మూడు నాలుగు సార్లు నన్ను అడిగారు. ఆయన సరదాగా అన్నారేమో అనుకున్నాను. ఆ పాట అంటే ఆయనకు చాలా ఇష్టం ఉండటం వల్ల పాట రికార్డ్‌ చేయాలని భావించారు. కరోనా కారణంగా చేయలేక పోయాం. త్వరలో నాన్నకు ప్రేమతో పాటను ఆయనతో రికార్డ్‌ చేయాలనుకుంటూ ఉండగా ఇలా జరగడం బాధాకరం అంటూ దేవిశ్రీ ఎమోషనల్‌ అయ్యారు. ఇదే సమయంలో ఆయన తన తల్లిగారి విగ్రహంను నెల్లూరు జిల్లాలోని తన వేద పాఠశాలలో ప్రతిష్టించాలని భావించారు. అందుకోసం ఆమె విగ్రహంను కూడా తయారు చేయించారు.

కొత్త పేటకు చెందిన ప్రముఖ శిల్పి డి రాజ్‌ కుమార్‌ వడయార్‌ వద్ద తన తల్లి విగ్రహంతో పాటు తన విగ్రహంను కూడా తయారు చేయించుకున్నారు. ఇప్పటికే వేద పాఠశాలలో తండ్రి కాంస్య విగ్రహంను ఏర్పాటు చేయించిన బాలు గారు ఆ పక్కనే తల్లి విగ్రహంను కూడా ఏర్పాటు చేయించాలని భావించారు. అందుకోసం విగ్రహం కూడా రెడీ అయ్యింది. కాని కరోనా కారణంగా ఆవిష్కరణ కార్యక్రమం ఆలస్యం అయ్యింది. తల్లి విగ్రహం ఆవిష్కరించకుండానే చనిపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన కుటుంబ సభ్యులు ఆ పని చేయబోతున్నారు. ఇన తాను ఎంతో ఇష్టపడి చేయించుకున్న విగ్రహంను కూడా ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చి ఆయన కోరుకున్నట్లుగా స్టూడియోలో ఉంచబోతున్నారట.