Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూసివ్ - ఆకాశంనీహద్దురా హీరోయిన్ అపర్ణ బాలమురళితో స్పెషల్ చిట్ చాట్
By: Tupaki Desk | 10 Nov 2020 5:30 AM GMT* హాయ్ అపర్ణ, ఫస్ట్ టైమ్ కంటెంట్ ప్లస్ కమర్షీయాలటీ ఉన్న సినిమాలో నటించినట్లున్నారు ఎలా అనిపిస్తోంది
- హాయ్, 2016లో నా ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆకాశం నీ హద్దురా మాత్రమే నా మొట్టమొదటి భారీ బడ్జెట్, కమర్షీయల్ సినిమా, అలానే సూర్య వంటి సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న హీరోతో కూడా నటించడం ఇదే మొదటిసారి, ఇంకా ఫస్ట్ టైమ్ నా ఫెవరేట్ డైరెక్టర్ సుధగారితో పనిచేయడం, తొలిసారిగా నేను బొమ్మి అనే పవర్ ఫుల్ రోల్ లో నటించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాజెక్ట్ ద్వారా నాకు చాలా తొలి అనుభవాలు ఎదురైయ్యాయి. అందుకే ఈ సినిమా నాకు సంథింగ్ స్పెషల్.
* 4 ఏళ్లలో 13 సినిమాల్లో నటించారు, మరో మూడు సినిమా ప్రొడక్షన్ లో ఉన్నాయి, కానీ ఇందులో ఏ ఒక్కటి తెలుగు సినిమా కాదు, ఆకాశం నీ హద్దురా కూడా తెలుగు డబ్బింగ్ లెక్కలోకి వస్తోంది, టాలీవుడ్ కి ఎందుకంత దూరంగా ఉంటున్నారు
- అయ్యో టాలీవుడ్ కి నేను దూరంగా ఉండటం ఏంటండి, మా మళయాలీ అమ్మాయిల్ని ఎందరినో హీరోయిన్స్ గా ఆదిరిస్తున్నారు తెలుగు సినీ ప్రేక్షకులు, అంతేకాదు నేను కూడా తెలుగు సినిమాలు చూస్తూ ఉంటాను. నాకు మహానటి సినిమాలో కీర్తి సురేశ్ పోషించిన పాత్రలో నటించాలని ఉంది. వాస్తవానికి అదే నా డ్రీమ్ రోల్, అంతేకాదు నేను ఆమెకి పెద్ద ఫ్యాన్ ని కూడా, ఇక మళయాలంలో కూడా స్టార్ హీరోగా రాణిస్తున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే నాకు అభిమానం, ఆయన సినిమాలు చూస్తుంటాను, విజయ్ దేవరకొండ సినిమాలు కూడా నచ్చుతాయి. వారితో ఎప్పటికైనా నటించాలనుంది. ఆకాశం నీ హద్దురా సినిమా నన్ను తెలుగు ప్రేక్షకులకి దగ్గర చేస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తరువాత సరైన అవకాశం టాలీవుడ్ నుంచి వస్తే తప్పకుండా నటిస్తాను
* సుధ కొంగర సినిమాల్లో హీరోయిన్స్ క్యారెక్టర్ హీరోలకి ధీటుగా ఉంటుంది, కొన్ని సార్లు మీరు హీరోని కొట్టాల్సి కూడా రావాచ్చు, అలాంటి సన్నివేశాలు ఆకాశం నీ హద్దురాలో ఉన్నాయ, ఉంటే మీరు ఆ సన్నివేశాల్లో నటించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు
- హీరోయిన్ క్యారెక్టర్ హీరోకి థీటుగా ఉండెలా డైరెక్టర్ సుధ కొంగర డిజైన్ చేసుకుంటారు, బహుశ తన గురువు మణిరత్నం దగ్గర నుంచి ఆమెకి ఇది అలవాటు అయిందమో అని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఆకాశం నీ హద్దురాలో కూడా నేను సూర్య గారికి తిడతాను, ఆయన పాత్రకు ధీటుగా నా పాత్ర ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నాకు కొద్దిగా భయం అనిపించినా సూర్య గారు డౌన్ టు ఎర్త్ ఉంటూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా చేస్తున్నంత సేపు నాకు సూర్యగారితో నటిస్తున్నా అనే భయం కంటే, సుధ డైరెక్షన్ లో నటిస్తున్నా ఆమెని ఎలా ఇంప్రెస్ చేయాలనే టెన్షన్ ఎక్కువుగా ఉండేది.
* ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకి ఏం చెబుతారు
- కరోనా కారణంగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అమెజాన్ లో విడుదల అవుతుంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ని కాస్త పక్కనపెట్టేసి, మీ ఇంటికే ఆకాశం నీ హద్దురా సినిమా వచ్చిందని భావించి ఒకే ఫ్లోలో సినిమా చూసి నన్ను నా చిత్ర బృందాన్ని ఆదరించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నా
- థ్యాంక్యూ