Begin typing your search above and press return to search.

సూపర్ గిఫ్ట్ పంపిన నీర్జా ఫ్రెండ్స్

By:  Tupaki Desk   |   21 Feb 2016 7:30 PM GMT
సూపర్ గిఫ్ట్ పంపిన నీర్జా ఫ్రెండ్స్
X
ఇప్పటివరకూ గ్లామర్ హీరోయిన్ గానే గుర్తింపు పొందిన సోనమ్ కపూర్.. తొలిసారిగా నటిగానూ అనేక ప్రశంసలు అందుకుంటోంది. దీనికి నీర్జా భానోట్ పై తీసిన లైఫ్ పిక్ 'నీర్జా' కారణమైంది. 30 ఏళ్ల క్రితం 360మందిని కాపాడి తను ప్రాణాలు పోగొట్టుకున్న ధీర వనిత అయిన ఓ ఫ్లైట్ అటెండెంట్ నీర్జా భానోట్. తాజాగా విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. ఆమె క్లాస్ మేట్స్ తో కలిసి సోనమ్ కపూర్ ఈ మూవీని చూడ్డం విశేషం.

నీర్జా స్నేహితులతో కలిసి నీర్జా సినిమాని.. సోనమ్ చూడ్డమే ఓ స్పెషల్ అయితే.. ఆమెకు మరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు ఆమె క్లాస్ మేట్స్. ఓ టీ షర్ట్ అంతా పలు మెసేజ్ లు రాసి ఉన్న ఓ టీషర్టును సోనమ్ కి బహుమతిగా అందించారు. బాంబే స్కాటిష్ లోగో ప్రింట్ అయిన ఉన్న ఈ టీషర్టుతో సోనమ్ బాగానే సందడి చేసింది. నీర్జా క్లాస్ మేట్స్ కు థ్యాంక్స్ చెప్పి, తన సంతోషాన్ని పంచుకుంది.

రాన్జానా తర్వాత.. పెర్ఫామెన్స్ విషయంలో సోనమ్ కు ఇంతగా ప్రశంసలు రావడం ఇదే తొలిసారి. ఇంకా చెప్పాలంటే సోనమ్ కెరీర్ బెస్ట్ మూవీ ఇదే అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటివరకూ స్సిన్ షో, క్లీవేజ్ షోలకే పరిమితం అయిన సోనమ్ కపూర్.. తనలోని యాక్టింగ్ ట్యాలెంట్ ను నీర్జా మూవీతో పూర్తిగా బయటపెట్టింది. ఈ సినిమా ఇంతగా సక్సెస్ కావడానికి సోనమ్ పెర్ఫామెన్స్ ఒక్కటే కారణం అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.