Begin typing your search above and press return to search.

భీమ్లా ఐదో షో.. ఏపీలో అలా.. తెలంగాణాలో ఇలా..!

By:  Tupaki Desk   |   23 Feb 2022 1:30 PM GMT
భీమ్లా ఐదో షో.. ఏపీలో అలా.. తెలంగాణాలో ఇలా..!
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన 'భీమ్లా నాయక్' సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. పవన్ సినిమా వస్తుందంటే ఉండే హడావిడి మొదలైపోయింది. అన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవడం.. ఇప్పటికే ఆల్మోస్ట్ ఫుల్ అవడమైంది.

ఈ నేపథ్యంలో విడుదలకు ముందు 'భీమ్లా నాయక్' మేకర్స్ ఈరోజు బుధవారం సాయంత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్లాన్ చేసారు. హైదరాబాద్‌ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ఈ వేడుక జరగనుంది. దీనికి తెలంగాణ మంత్రులు కేటీఆర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలకు పరిస్థితులు ఏపీలో ఒకలా తెలంగాణాలో ఇంకోలా ఉన్నాయి.

తెలంగాణలో 'భీమ్లా నాయక్' సినిమాకు 5 షోలు ప్రదర్శించుకోడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ సర్కార్.. ఈ నెల 25 తేదీ నుంచి మార్చి 11 వరకు అదనపు షో వేసుకోడానికి అనుమతిని మంజూరు చేసింది. ఇది భీమ్లా వసూళ్లకు బూస్టప్ లా పని చేసే అవకాశం ఉంది.

అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భీమ్లా నాయక్ సినిమాకు బెన్ ఫిట్ షో - అదనపు షోలకు పర్మిషన్ లేదు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారమే షోల ప్రదర్శన ఉంటాయి. ఒకవేళ దాన్ని అతిక్రమించి బెన్ ఫిట్ షో వేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. టికెట్ రేట్లు ప్రభుత్వ నిభందనల మేరకు ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి థియేటర్ వద్ద రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుందని పేర్కొంటూ.. దీనికి థియేటర్ యాజమాన్యం సహకరించాలని కోరారు.

దీంతో 'భీమ్లా నాయక్' కలెక్షన్స్ కు ఏపీలో కాస్త గండి పడనుంది. టికెట్ ధరలు పెంచుకోవడానికి జగన్ సర్కారు సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలానే పెద్ద సినిమాలతో పాటుగా చిన్న చిత్రాలకూ ఐదో షోకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. కాకపోతే ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక జీవో విడుదల కాలేదు.

ఈ నెలాఖరు లోపు దీనిపై ప్రకటన వస్తుందని ఇటీవల సినీ ప్రముఖుల బృందం చెప్పారు. ఒకవేళ సవరించబడిన ఆ జీవో ఈ రెండు రోజుల లోపల వస్తే మాత్రం 'భీమ్లా నాయక్' సినిమాకు ప్లస్ అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇకపోతే ఏపీలో ఈ సినిమా బుకింగ్స్ తెఱుక్కుకున్న వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తోంది.

కాగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకు అధికారిక తెలుగు రీమేక్. పవన్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. పవన్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్ లుగానటించారు.

ఇప్పటి వరకు 'భీమ్లా నాయక్' సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు.