Begin typing your search above and press return to search.
ట్రైలర్స్ కోసం స్పెషల్ షూట్స్.. ప్రేక్షకులను ఆకర్షించడమే అసలు టార్గెట్..!
By: Tupaki Desk | 28 Jun 2022 3:30 PM GMTతక్కువ బడ్జెట్ లో తీసిన చిన్న సినిమా అయినా.. కోట్లు ఖర్చు చేసి రూపొందించిన పెద్ద సినిమా అయినా.. జనాల్లోకి వెళ్లాలంటే దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేయాల్సిందే. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగితేనే థియేటర్ల వరకూ రప్పించగలుగుతారు.ఒకప్పుడు సినిమా విడుదలకు ముందు పేపర్ యాడ్స్ - కాన్వాసింగ్ - ఆడియో ఫంక్షన్స్.. ఇలా ఆఫ్ లైన్ పబ్లిసిటీ చేసేవారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్రచారం అనేది చాలా కీలకంగా మారింది.
ఫస్ట్ లుక్ - స్పెషల్ గ్లిమ్స్ - పాటలు - టీజర్ - ట్రైలర్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేసి సినిమాపై బజ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇవే ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకొస్తాయి కాబట్టి.. ప్రమోషనల్ కంటెంట్ కు వచ్చే రీచ్ ను బట్టి సినిమాకు ఎంత క్రేజ్ ఉందనేది డిసైడ్ చేస్తున్నారు.
ఓటీటీ కల్చర్ మొదలైన తర్వాత థియేటర్ల పట్ల ప్రేక్షకుల ఆసక్తిని మెల్లమెల్లగా తగ్గించేస్తోందనే మాట వాస్తవం. జనాలు ఇంట్లోనే డిజిటల్ మాధ్యమాల్లో సినిమాలు చూడటానికి అలవాటు పడిపోవడంతో.. థియేటర్లకు వచ్చేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోంది. సెలెక్టివ్ గా కొన్ని సినిమాలను మాత్రమే ప్రేక్షకులు థియేటర్లలో చూడటానికి ఇష్టపడుతున్నారు. అది కూడా ట్రైలర్ ని చూసే థియేటర్ లో చూడాలా.. ఓటీటీలోకి వచ్చే వరకూ వేచి చూడాలా అనేది చాలా త్వరగా డిసైడ్ అవుతున్నారు.
అందుకే ఈరోజుల్లో టీజర్ మరియు ట్రైలర్లను మరింత ఆసక్తికరంగా కట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఫిల్మ్ మేకర్స్ అంతా ట్రైలర్ మీదనే ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు.తమ క్రియేటివిటీతో ఒక చిన్న ట్రైలర్ ను కట్ చేసి.. సినిమా ఎలా ఉంటుందో శాంపిల్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫుల్ మూవీ ఎలా వుండబోతుందోనన్న ఉత్సాహన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ట్రైలర్ ను ప్రమోట్ చేయడానికి సెపరేట్ వీడియోలను కట్ చేయడమే కాకుండా.. దాని కోసం అదనపు షూట్‌లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు వీటిని ఒక స్పెషల్ డిజిటల్ టీమ్ కి ఇచ్చి, మరింత అట్రాక్టీవ్ గా తీర్చిదిద్దుతున్నారు.
మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు.. సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడానికి కూడా ట్రైలర్ సహాయ పడుతుంది కాబట్టి.. దాని కోసం అదనంగా ఖర్చు చేయడానికి కూడా మేకర్స్ రెడీగా వుంటున్నారని తెలుస్తోంది.