Begin typing your search above and press return to search.

RRR ఎంట్రీకి ఆ రోజు కీల‌కంగా మార‌నుందా?

By:  Tupaki Desk   |   24 Sep 2022 6:52 AM GMT
RRR ఎంట్రీకి ఆ రోజు కీల‌కంగా మార‌నుందా?
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా విజువ‌ల్ వండ‌ర్ 'RRR'. స్టార్ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లు తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇది. 1920 ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేప‌థ్యంలో అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీంల ఫిక్ష‌నల్ పీరియాడిక్ స్టోరీగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ప్రశంస‌ల‌తో పాటు రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని కూడా రాబ‌ట్టి న తెలుగు సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మోద‌లైన త‌రువాతే విదేశీ ప్రేక్ష‌కుల‌తో పాటు హాలీవుడ్ మేక‌ర్స్ దృష్టిని ఆక‌ర్షించింది. ఈ వేదిక‌గాపై ఈ మూవీని ప్ర‌త్యేకంగా వీక్షించిన ప‌లువురు హాలీవుడ్ మేక‌ర్స్, న‌టీన‌టులు, ర‌చ‌యిత‌లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా వుంటే హాలీవుడ్ ప్ర‌శంస‌లు పొంద‌డంతో 'RRR'ఖ‌చ్చితంగా ప్ర‌తిష్టాత్మక ఆస్కార్ బ‌రిలో విదేశీ సినిమాల విభాగంగాలో ఉత్త‌మ అంత‌ర్జాతీయ సినిమాగా నిలుస్తుంద‌ని అంతా భావించారు. అంతే కాకుండా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస్కార్ వారికి ఈ మూవీ చేరువ‌య్యేలా అభిమానులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ట్వీట్ ల వ‌ర్షం కురిపించాయి. అయితే అనూహ్యంగా ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా గుజ‌రాతీ మూవీ 'చ‌ల్లో షో' సినిమాని ఇండియా త‌రుపున ఆస్కార్ కు ఎంపిక చేయ‌డం తెలిసిందే.

దీంతో 'RRR' ఫ్యాన్స్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా స‌భ్యుల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. వారి నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా వుంటే 'RRR' క మ‌రో అద్భుత‌మైన అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 30న హాలీవుడ్ లోని చైనీస్ థియేట‌ర్ లో ఈ మూవీ ప్ర‌త్యేక షోని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నార‌ట‌. ఇది 'RRR'కు అత్యంత కీల‌కంగా మార‌బోతోంది.

అంతే కాకుండా ఈ మూవీని ఆస్కార్ అకాడ‌మీ స‌భ్యుల్లో ఓ కీల‌క వ్య‌క్తి ఆ రోజు 'RRR'ని ప్ర‌త్యేకంగా వీక్షించ‌బోతున్నారు. ఇది నిజంగా 'RRR' అభిమానులకు, మేక‌ర్స్ కి శుభ‌వార్తే. అదే రోజున అన్నీ కుదిరితే రాజ‌మౌళి కూడా అదే థియేట‌ర్లో పాల్గొనే అవ‌కాశం వుంద‌ని కూడా తెలుస్తోంది.

ఈ మూవీకి మ‌న దేశం నుంచి ఆస్కార్ బ‌రిలో నిలిచే అవ‌కాశం కొన్ని కార‌ణాల వ‌ల్ల కోల్పోయినా ఓవ‌ర్సీస్ లో ఈ మూవీని రిలీజ్ చేసిన వేరియ‌న్స్ పిక్చ‌ర్స్ 'RRR'ని అకాడ‌మీ దృష్టికి తీసుకెళ్లాల‌ని చేస్తున్న కృషి వ‌ల్లే ఇదంతా జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 30న ఏం జ‌ర‌గ‌బోతోంది. యావ‌త్ ఇండియ‌న్స్ ఆస‌క్తిగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క‌ల నెల‌వేర నుందా? అన్న‌ది తెలియాలంటే సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.