Begin typing your search above and press return to search.
మహేష్ అడుగుజాడల్లో నడుస్తున్న సూపర్ ఫ్యాన్స్..!
By: Tupaki Desk | 3 Aug 2022 10:45 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తమ ఫేవరేట్ హీరో ఎలాగో తాము కూడా అలాగే అని ఫ్యాన్స్ నిరూపిస్తున్నారు. సినిమాలు చూసి ఎంజాయ్ చేయడమే కాదు.. మహేష్ ని ఆదర్శంగా తీసుకొని, అతని అడుగు జాడల్లోనే నడుస్తామని ప్రకటిస్తున్నారు.
ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి అభిమానులు ఎప్పటి నుంచో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ 'పోకిరి' సినిమా స్పెషల్ షోలను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
'పోకిరి' స్పెషల్ షోల ప్రకటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో పలు నగరాల్లో అదనంగా షోలు యాడ్ చేస్తూ వస్తున్నారు.
అయితే 'పోకిరి' స్పెషల్ షోల ద్వారా వచ్చిన కలెక్షన్లను ఛారిటీ కోసం విరాళంగా ఇవ్వాలని మహేష్ బాబు అభిమానులు నిర్ణయించుకున్నారు. MB ఫౌండేషన్ ద్వారా పిల్లల గుండె ఆపరేషన్లు మరియు పేద పిల్లల విద్యకు సహాయం చేయడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేస్తూ.. 'పోకిరి' స్పెషల్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నిమిషాల్లో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ స్పెషల్ షోల మొత్తాన్ని మా సూపర్ అభిమానులు మరియు మా ప్రియమైన పంపిణీదారులు MB ఫౌండేషన్ ద్వారా పిల్లల గుండె ఆపరేషన్లు మరియు పేద పిల్లల విద్యకు సహాయం చేయడానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఇలాంటి చొరవ తీసుకుంటునన్నట్లు ప్రకటించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మాకు మద్దతు ఇస్తున్నందుకు అభిమానులు మరియు పంపిణీదారులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగుజాడల్లో నడవడం ద్వారా వీలైనంత ఉత్తమమైన మార్గంలో ఇలాంటి ఎన్నో ఉదాత్తమైన పనులు చేయాలని ఎదురుచూస్తున్నాము. ఈ ఆగస్ట్ 9 సూపర్ స్పెషల్ గా మారబోతోంది అని పేర్కొన్నారు.
మహేష్ బాబు సేవాగుణం ఎలాంటిదో మనం చూస్తూనే ఉన్నాం. సమాజానికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుందే అగ్ర హీరో.. ఇప్పటికే MB ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడు. ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ‘హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్’ సంస్థతో కలిసి వైద్య ఖర్చులు భరించలేని ఎందరో చిన్నారుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు.
అలానే ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్.. అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ 'శ్రీమంతుడు' అనిపించుకున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మహేష్ హీరో అని కొనియాడబడుతున్నారు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ సైతం అదే బాటలో నడుస్తూ తమవంతు సహాయం చేయడానికి ముందుకురావడం అభినందిచదగ్గ విషయమనే చెప్పాలి.