Begin typing your search above and press return to search.
స్పెషల్ స్టోరీ : పెళ్లెప్పుడవుతుంది బాబూ..
By: Tupaki Desk | 7 May 2022 12:30 AM GMTప్రతీ ఒక్కరి జీవితంలోనూ పెళ్లికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఎంచుకునే జీవిత భాగస్వామికి సంబంధించి ఎన్నెన్నో కోరికలు.. ఊహలు వుంటాయి. అవన్నీ పర్ ఫెక్ట్ గా కుదిరినా అందులో కొన్ని మాత్రమే మ్యాచ్ అయినా కొంత మంది పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు. కానీ ఇందులో ఏ ఒక్కటీ తక్కువైనా కొంత మంది మాత్రం పెళ్లికి దూరంగా వుంటుంటారు. ఇదిలా వుంటే మన టాలీవుడ్ స్టార్స్ 40కి చేరుకుంటున్నా పెళ్లి ప్రస్తావనే ఎత్తడం లేదు. పెళ్లి గురించి మాట్లాడితే ఆ సందర్భం వచ్చినప్పడు చెబుతానంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక హీరోయిన్ లదీ ఇదే పరిస్థితి. హీరోల తరహాలోనే ఇప్పటికీ సోలో బ్రతుకే సోబెటరు అంటూ బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ విషయంలో లేడీస్ ఫస్ట్ అంటుంటారు కాబట్టి ముందు హీరోయిన్ ల గురించి చెప్పుకుందాం. 40 క్రాస్ అయినా పెళ్లికి ఇంకా టైముందంటున్న అనుష్క నుంచి 34 క్రాస్ అయిన నిత్యామీనన్ వరకు పెళ్లికి లైన్ లో వున్న క్రేజీ హీరోయిన్ లు ఆరుగురున్నారు. వాళ్లే అనుష్క, నయనతార, త్రిష, శృతిహాసన్, నిత్యామీనన్, అంజలి. ఇందులో నయనతార, శృతిహాసన్ మాంచి జోరుమీదున్నారు. ఇప్పటికే నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ తో గత కొంత కాలంగా ప్రేమలో వుంటూ సహజీవనం చేస్తున్నారు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో వున్న ఈ జంట పెళ్లి గురించి మాత్రం అడిగితే సమాధానం చెప్పడం లేదు. ఇంతకీ వీరి పెళ్లి జరిగిందా? జరిగలేదా? అన్నది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రేమ అంటే విరక్తి పుట్టినప్పుడు పెళ్లి చేసుకుంటామని ఆ మధ్య విఘ్నేష్ శివన్ చమత్కరించాడు కూడా.
రెండున్నరేళ్లుగా దోష నివారణ పూజాలంటూ ఈ జంట గుళ్లూ గోపురాలు తిరుగుతూ వస్తోంది. తాజాగా ఈ జంట శిరిడీ వెళ్లింది. అక్కడ బాబాని దర్శించుకున్న విషయాన్ని విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ఫొటోలని పోస్ట్ చేసి వెల్లడించాడు. కానీ పెళ్లి వార్తని మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే వుంచేస్తున్నారు. నయన్ కు ప్రస్తుతం 37 ఏళ్లు. నవంబర్ 18 వస్తే 38కి చేరుకుంటుంది. ఇక నయన్ తరువాత డేటింగ్ చేస్తూ లైన్ లో వున్న హీరోయిన్ శృతిహాసన్. గతంలో మైఖేల్ కోర్సల్ తో డేటింగ్ లో వున్న శృతి అతనికి బ్రేకప్ చెప్పేసి లాక్ డౌన్ నుంచి శంతను హజారికతో సహజీవనం చేస్తోంది. ఇద్దరు కలిసి ముంబై ఫ్లాట్ లో వుంటున్నారు. శృతి ఏజ్ 36 ఏళ్లు. పెళ్లి గురించి ఎలాంటి న్యూస్ లేదు. పెళ్లి ఊసెత్తకుండా ప్రస్తుతం సహజీవనంతోనే సరిపెట్టుకుంటోంది.
ఈ ఇద్దరి తరువాత లైన్ లో వున్న క్రేజీ హీరోయిన్ అనుష్క. గత ఏడాది నవంబర్ 7తో 40 లోకి ఎంటరైంది. `బాహుబలి` సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్న స్వీటి కర్ణాటక మంగళూరులోని తులు ఫ్యామిలీలో పుట్టింది. ఫ్యామిలీకి గారాల పట్టి. దాంతో తను ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడే పెళ్లి అని ఫ్యామిలీ అంతా తనకు సపోర్ట్ చేస్తున్నారు. దాంతో ఈ జేజమ్మ ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి గురించి మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి యువీ వారు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
అనుష్క తరువాత పెళ్లికి లైన్ లో వున్న హీరోయిన్ త్రిష..ఈ మే 4 కి 39లోకి ఎంటరైంది. కానీ ఇప్పటికీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. 2015లో తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో జనవరి 25న త్రిషకు ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక పెళ్లే అనుకున్నారంతా కానీ అనూహ్యంగా ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకుంది. అప్పటి నుంచి పెళ్లి గురించి మాట్లాడటం లేదు. ఆ ఊసే ఎత్తడం లేదు. వరుణ్ మణియన్ కారణంగా అప్ సెట్ అయిన త్రిష పెళ్లి అంటే ఆసక్తి చూపించడం లేదట. ఇక నిత్యామీనన్ ఇప్పటికే 34 ఏళ్లు క్రాస్ చేసింది.. కానీ పెళ్లి ఊసెత్తకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, ఓటీటీ షోల్లో పాల్గొంటూ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న `తిరు చిత్రాంబలం`లో నటిస్తోంది. అంజలి ది కూడా ఇదే దారి. 35 ఏళ్లకు చేరుకున్న ఏజ్ బార్ టెన్షన్ ఏ మాత్రం కనిపించకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ హల్ చల్ చేస్తోంది.
హీరోయిన్ ల పరిస్థితి ఇలా వుంటే మన స్టార్ హీరోలు కూడా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ మాటెత్తితేనే కిలోమీటర్ దూరం పారిపోతున్నారు. ఇందులో ముందు వరుసలో వుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ హీరో పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు ఇంత వరకు ఏ హీరో గురించి రాలేదని చెప్పొచ్చు. గత ఏడాది అక్టోబర్ 23తో 42లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ `బాహుబలి` సీరీస్ తరువాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు మాటిచ్చారట. ఇప్పటికీ ఆ మాటని నిలబెట్టుకోలేకపోగా పెళ్లి మాటెత్తిన ప్రతీసారీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూనే వున్నారు. ఆ సమయం, సందర్భం వచ్చినప్పుడే చేసుకుంటానని, అది ఎప్పుడొస్తుందో నాకు తెలియదని స్టేట్‌మెంట్ ఇచ్చి ఇటీవల షాకిచ్చారు.
ప్రభాస్ తరువాత రేసులో వున్న యంగ్ హీరో శర్వానంద్. అప్పుడే శర్వా 38లోకి వచ్చేశాడు. పెళ్లి గురించి మాత్రం ఇప్పటికీ ఈ హీరో మౌనం పాటిస్తూనే వున్నారు. ఈ ఏడాది అయినా వుంటుందా? లేక వచ్చే ఏడాదైనా పెళ్లి చేసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. సాయిధరమ్ తేజ్ ఈ మెగా హీరోకు 35 క్రాస్.. ఈ హీరోకు పెళ్లి చేయాలని ఆయన మదర్ ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాదైనా ఫైనల్ అయ్యే అవకాశాలు వున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ కూడా 33 లోకి వచ్చేశాడు. ఆయన పెళ్లి గురించి ఇంట్లో పోరు మొదలైందట.
ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 32కి వచ్చేశాడు. ఆయన పెళ్లి గురించి ఇటీవల నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు. తను ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడే పెళ్లని చెప్పేశారు. నాగశౌర్య ఏజ్ 33.. ఈ హీరో కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అడివిశేష్ (36) ఇప్పటికే ప్రేమలో వున్నానని క్లారిటీ ఇచ్చాడు. అయితే పెళ్లెప్పుడన్నది మాత్రం చెప్పడం లేదు. ఇలా క్రేజీ హీరోయిన్ లు , హీరోలు పెళ్లెప్పుడవుతుందో చెప్పకుండా దాగుడుమూతలు అడుతున్నారు.