Begin typing your search above and press return to search.

200% పాన్ ఇండియా స్టార్ అవుతాడు.. కానీ పాన్ ఇండియా పొలిటీషియ‌న్ మాత్రం డౌట్‌!

By:  Tupaki Desk   |   15 April 2021 6:31 AM GMT
200% పాన్ ఇండియా స్టార్ అవుతాడు.. కానీ పాన్ ఇండియా పొలిటీషియ‌న్ మాత్రం డౌట్‌!
X
తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది అన‌గానే గుర్తొచ్చే ప్ర‌ధాన అంశాల్లో ఒక‌టి పంచాంగ శ్ర‌వ‌ణం. సాధార‌ణ జ‌నాల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు.. రాబోయే ఏడాదిలో త‌మ జాత‌కం ఏ విధంగా ఉందో టెస్ట్ చేయించుకుంటారు. అయితే.. సెల‌బ్రిటీల జాత‌కంపై జ‌నాల్లో క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే.. ప్ర‌ధాన‌ రాజ‌కీయ నాయ‌కుల జాత‌కాలు ప్రచారంలోకి వ‌స్తుంటాయి.

ఈ ప్ల‌వ‌నామ సంవ‌త్స‌రంలో సినీ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జాత‌కం ఎలా ఉండ‌బోతోంద‌నే విష‌యం వార్త‌గా మారింది. ఆయ‌న జాత‌క చ‌క్రాన్ని వెల్ల‌డించిన పండితులు.. ప‌వ‌న్ కీర్తి ఇంతింతై అన్న‌ట్టుగా ఎదుగుతుంద‌ని చెప్పారట‌. ఈ సంవ‌త్స‌రం ప‌వ‌న్ క‌ల్యాణ్ జాత‌కం బాగుంద‌ని, అత‌ని కీర్తి రాష్ట్రాన్ని దాటి, జాతీయ స్థాయిలో వెలిగిపోతుంద‌ని చెప్పార‌ట‌. దీంతో.. ఈ విష‌యం డిస్క‌ష‌న్లోకి వ‌చ్చేసింది. ఈ మేర‌కు విశ్లేష‌ణ‌లు కూడా వెలువ‌డుతున్నాయి.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడేళ్ల త‌ర్వాత సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ‘వ‌కీల్ సాబ్‌’గా వచ్చిన పవర్ స్టార్.. ప్రభంజనం సృష్టిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. క‌లెక్ష‌న్ల వ‌సూళ్ల‌లో స‌రికొత్త రికార్డులు న‌మోదు చేస్తూ దూసుకెళ్తోంది. ఇక‌, ప‌వ‌న్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ఏడాది ప‌వ‌న్‌ జాత‌కం ప్ర‌కారం చూస్తే.. ఇప్పుడు వ‌కీల్ సాబ్ ఘ‌న విజ‌యం, త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ గా జాతీయ స్థాయిలో వెలిగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇదే త‌ర‌హాలో.. పాన్ ఇండియా ప్రాజెక్టుల‌ను ఎంచుకుంటే.. వంద‌కు 200 శాతం ఆయ‌న స్టార్ డ‌మ్ దేశ‌వ్యాప్తం అవుతుంద‌ని అంటున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో డిస్క‌షన్ కూడా న‌డుస్తోంది.

కానీ.. రాజ‌కీయంగా జాతీయ స్థాయిలో వెలిగిపోవ‌డం డౌట్ అని అంటున్నారు. పాలిటిక్స్ లో ఆయ‌న వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణ‌యాలు చూస్తుంటే.. నేష‌న‌ల్ లెవ‌ల్ లో స‌త్తా చాట‌డం క‌ష్ట‌మేనని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై కేంద్రాన్ని ప్ర‌శించ‌క‌పోవ‌డం, బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ప్ర‌త్యేక హోదా వంటి విష‌యాల్లోనూ కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేదు ప‌వ‌న్‌. ఇలాంటి నిర్ణ‌యాల వ‌ల్ల జ‌నాల్లో న‌మ్మ‌కం కోల్పోతున్నార‌ని అంటున్నారు.

ఇక‌, రాష్ట్రంలో బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ.. స‌రైన స‌ఖ్య‌త క‌నిపించ‌ట్లేదు. కేవ‌లం ప‌వ‌న్ ను వాడుకుని వ‌దిలేసే విధంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కూడా అంటున్నారు. ఈ విష‌యంలో ప‌వ‌న్ సైతం గుర్రుగా ఉన్నార‌ని అంటున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితాల త‌ర్వాత ఈ దోస్తీ ప‌రిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియ‌దు. ఇలాంటి కార‌ణాల‌తో ప‌వ‌న్ రాజ‌కీయాల్లో జాతీయ‌స్థాయిలో వెల‌గ‌డం ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.