Begin typing your search above and press return to search.
స్పెషల్ స్టోరీ : సోషల్ మీడియా రికార్డ్ .. ఐతే బొమ్మ బ్లాక్ బస్టరే
By: Tupaki Desk | 7 May 2022 10:30 AM GMTస్టార్స్ సినిమాల విషయంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. నచ్చిన స్టార్ సినిమా సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగాల్సిందే. అలా మోత మోగితేనే బొమ్మ బ్లాక్ బస్టరే. దీన్ని ఫ్యాన్స్ ఇప్పడు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. తమకు నచ్చిన స్టార్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్.. టీజర్, లిరికల్ వీడియోస్, సాంగ్స్ వీడియోస్, ట్రైలర్ ఇలా స్టార్ హీరోకు సంబంధించిన ఏ చిన్న వీడియో వదిలినా దాన్ని నెట్టింట వైరల్ చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. నిత్యం సదరు వీడియోలని ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ నయా ట్రెండ్ ఏ రేంజ్ కి చేరిందో సినిమాని ఏ స్థాయిలో వైరల్ గా మారుస్తుందో చూద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నతాజా యాక్షన్ ఎంటర్ టైనర్ 'సర్కారు వారి పాట'. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలే సినిమాపై అంచనాల్ని పెంచేసింది. 24 గంటల్లోనే 2 కోట్ల67 లక్షలకు పైగా వ్యూస్ ని సాధించి టాలీవుడ్ లో హయ్యెస్ట్ వీవుడ్ ట్రైలర్ గా రికార్డుని సాధించింది. నెంబర్ 1 ప్లేస్ ని సొంతం చేసుకుంది. మహేష్ సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక వారికి కావాల్సిన స్టఫ్ దొరికితే వూరుకుంటారా వైరల్ చేయాల్సిందే. అదే చేశారు. సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగించారు.
ట్రైలర్ లో దుమ్ముదులిపే కంటెంట్ వుండటంతో ఓ రేంజ్ లో పిచ్చెక్కించారు. దీంతో ట్రైలర్ టాప్ ట్రెండ్ కి చేరుకుని నెం.1 స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే హయ్యెస్ట్ లైక్ ల విషయంలో మాత్రం ఈ మూవీ సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. 12 లక్షల 19 వేల లైకులతో మోస్ట్ లైక్ట్ ట్రైలర్ ల జాబితాలో సెకండ్ ప్లేస్ ని దక్కించుకుంది. ఇక ఇటీవల విడుదలైన 'ట్రిపుల్ ఆర్' 12 లక్షల 40 వేల లైకులతో రికార్డుని సొంతం చేసుకుని ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించింది. ఇక 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని రాబట్టిన ట్రైలర్ ల జాబితాలో ప్రభాస్ 'రాధేశ్యామ్' 2 కోట్ల 32 లక్షల వ్యూస్ తో 'సర్కారు వారి పాట' తరువాత స్థానంలో నిలిచింది.
మూడవ ప్లేస్ లో 2 కోట్ల 18 లక్షల వ్యూస్ తో ఆచార్య, బాహుబలి 2 నిలిచాయి. ఈ రెండు చిత్రాల తరువాత ట్రిపుల్ ఆర్ ట్రైలర్ 2 కోట్ల 4 లక్షల వ్యూస్ తో నిలిచింది. ఇక దీని తరువాత 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సాధించిన ట్రైలర్ ల జాబితాలో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, అల్లు అర్జున్ 'పుష్ప' ఇప్పటికీ అదే రేంజిలో డ్రెండ్ అవుతున్నాయి. ఇక అత్యధిక శాతం ప్రేక్షకులు ఇష్టపడిన ట్రైలర్ ల జాబితాలో మాత్రం ట్రిపుల్ ఆర్ రెండవ స్థానంలో నిలవడం విశేషం. మొదటి స్థానాన్ని 'సర్కారు వారి పాట' సొంతం చేసుకోగా రెండవ స్థానంలో 'ట్రిపుల్ ఆర్' సరి పెట్టుకుంది.
అన్ని భాషల్లో కలిపి ట్రిపుల్ ఆర్ ఇప్పటికి 150 మిలియన్ ల వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఇక 11 లక్షలకు పైగా లైక్స్ తో 'భీమ్లానాయక్' ఇప్పటికీ ట్రెండింగ్ లోనే వుంది. దీని తరువాత స్థానంలో కూడా పవన్ సినిమానే వుండటం విశేషం. 10 లక్షలకు పైగా లైకులతో వకీల్ సాబ్ అదే జోరుని చూపిస్తోంది. ఈ సినిమాల తరువాత పుష్ప, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలున్నాయి. ఇదిలా వుంటే సౌత్ హయ్యెస్ట్ వ్యూస్ ని సాధించిన చిత్రాల జాబితాలో చూస్తే విజయ్ నటించిన తమిళ చిత్రం 'బీస్ట్' 2కోట్ల 90 లక్షల వ్యూస్ తో మొదటి స్థానంలో నిలిచింది. విజయ్ సినిమా తరువాతే సౌత్ టాప్ సినిమాల్లో సర్కారు వారి పాట, ట్రిపుల్ ఆర్, బాహుబలి 2, రాధేశ్యామ్, ఆచార్య తదితర చిత్రాల ట్రైలర్ లున్నాయి.
ఇలా టీజర్‌లు , ట్రైలర్ లు, లిరికల్ వీడియోల తో ప్రతీ స్టార్ హీరో సినిమా సోషల్ మీడియాలో పోటీలుపడి మరీ ట్రెండింగ్ చేస్తున్నారు. దీంతో ప్రతీ హీరో సినిమా ట్రైలర్, టీజర్ లు నెట్టింట టాప్ లో ట్రెండ్ అవుతూ సినిమాపై బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ భారీ ఓపెనింగ్స్ కి దారి తీస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఎలా మారిందంటే సోషల్ మీడియాలో రికార్డు ఐతే బొమ్మ బ్లాక్ బస్టరే అనేంతగా మారిపోయింది. అలా ట్రెండ్ అయిన సినిమాల్లో అత్యధిక శాతం బ్లాక్ బస్టర్ లు గా నిలవడంతో ఇప్పడిది హీరోలకు నాయ ట్రెండ్ గా మారింది.