Begin typing your search above and press return to search.

మహిళాభిమానుల కు ప్రత్యేక కృతజ్ఞతలు: వెంకీ

By:  Tupaki Desk   |   21 Dec 2019 11:52 AM IST
మహిళాభిమానుల కు ప్రత్యేక కృతజ్ఞతలు: వెంకీ
X
విక్టరీ వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య నటించిన మల్టిస్టారర్ 'వెంకీమామ' హిట్ గా నిలిచింది. రివ్యూస్.. మౌత్ టాక్ యావరేజ్ గా ఉన్నప్పటికీ వెంకీ - చైతు కాంబినేషన్.. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీకి ఉన్న పట్టు.. సరైన రిలీజ్ టైమింగ్ లాంటి కారణాల వల్ల సినిమా హిట్ గా మారింది. ఈ సినిమా సక్సెస్ ను వెంకీ - చైతు ఇద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈమధ్య 'వెంకీమామ' టీమ్ గుంటూరు పర్యటన కు వెళ్ళారు. అక్కడ సక్సెస్ వేడుకల లో మాట్లాడుతూ వెంకీ ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. వెంకీ మొదటి నుంచి వివాదాల కు దూరంగా ఉండే వ్యక్తి.. ఆయన మాటలలో కొంత వేదాంతం కూడా ధ్వనిస్తూ ఉంటుంది. ఈసారి కూడా అలాంటి స్పీచ్ ఇచ్చారు వెంకీ. 'వెంకీమామ' విజయానికి ముఖ్య కారణం అభిమానులేనని.. అందులోనూ మహిళా అభిమానులని.. వారందరికీ మనస్ఫూర్తి గా కృతజ్ఞతలు తెలిపారు.

లివ్ అండ్ లెట్ లివ్(నువ్వు బ్రతుకు.. పక్కవాళ్ళను బ్రతకనీ) అనేది తన విధానమని చెప్పారు. పాజిటివ్ గా ఉండాలని ప్రేక్షకుల ను కోరారు. అంతే కాదు అందరి హీరోల సినిమాలు విజయం సాధించాలని.. ప్రతి హీరో అభిమానులు ఇతర హీరోల సినిమాల ను ఎంకరేజ్ చెయ్యాలని.. అప్పుడే తెలుగు సినిమా గొప్ప గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంకీ చెప్పినది ముమ్మాటికీ నిజం. అందరూ హీరోలు తమ అభిమానులకు ఇలాంటి సూచనలే ఇస్తే ఈ ఫ్యాన్ వార్స్ ఉండవు.. కనీసం తగ్గుతాయి కదా.