Begin typing your search above and press return to search.
నా కళ్లు, నవ్వు బావుంటాయ్ బాబోయ్
By: Tupaki Desk | 4 July 2015 5:30 PM GMTకథానాయికల్ని పరిశీలిస్తే ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరికి నవ్వినప్పుడు సొట్టబుగ్గలు అందాన్ని తెస్తాయి. మరికొందరికి రింగురింగుల శిరోజాలు అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇంకొందరికి కళ్లు, మరికొందరికి ముక్కు అందం పెంచుతుంది. కానీ కాజల్ విషయంలో మాత్రం ఓ రెండు కీలకమైన భాగాలు అందం పెరగడానికి కారణమని చెబుతోంది.
నా కళ్లు బావుంటాయి. అలాగే నేను నవ్వినప్పుడు నా బుగ్గలు కూడా బావుంటాయని చాలామంది చాలాసార్లు పొగిడేశారు. అంతేనా నేను ఏ డ్రెస్ వేసుకున్నా అందులో అందంగా ఉంటానని చెబుతుంటారు. ఈ విషయంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పింది కాజల్. అంతేనా ఈ తొమ్మిదేళ్ల పయనంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అసంతృప్తి అన్నదే లేదని సెలవిచ్చింది. ఎక్కడికి వెళ్లినా విజయాల్ని దక్కించుకున్నా. తెలుగు, తమిళ్, హిందీ అన్నిచోట్లా విజయాలు దక్కాయి. ఇలాంటి సంతృప్తి ఎందరికి దక్కుతుంది అని ప్రశ్నించింది.
నిజమే చందమామ కాజల్ అందం అంతా ఆ కళ్లు, నవ్వులోనే దాగి ఉంది. అందుకే తొలిసినిమా లక్ష్మీ కళ్యాణం ఫ్లాపైనా అవి చూసి పడిపోయిన మెగా హీరోలు వరుసగా సినిమాల్లో ఛాన్సులిచ్చి స్టార్‌ని చేసేశారు. ఇప్పుడు లక్కీగా మహేష్ బాబు సరసన మరోసారి హీరోయిన్ ఛాన్సు కూడా దక్కించేసుకుంది. పండగ చేసుకుంటోంది పాపాయ్.