Begin typing your search above and press return to search.

నానీపై ఐటీ రైడ్స్.. నిజం ఎంత‌?

By:  Tupaki Desk   |   20 Nov 2019 8:24 AM GMT
నానీపై ఐటీ రైడ్స్.. నిజం ఎంత‌?
X
టాలీవుడ్ ప్ర‌ముఖుల‌పై వ‌రుస ఐటీ దాడులు దేనికి సంకేతం? ప‌్ర‌స్తుతం ఫిలింస‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ ఇది. ఇంత‌కుముందు ప‌లువురు ప్ర‌ముఖ నిర్మాత‌లు .. స్టార్ హీరోల‌పై ఐటీ దాడులు జ‌రిగాయి. సూప‌ర్ స్టార్ మ‌హేష్.. ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ అనీల్ సుంక‌ర‌.. అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు కం ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు.. మరో సీనియ‌ర్ నిర్మాత‌ కె.ఎల్.నారాయ‌ణ‌.. ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దాన‌య్య .. ఇలా ఒక్కొక్క‌రిపై ఆక‌స్మిక ఐటీ దాడులు జ‌రిగాయి. ఐటీ స‌కాలంలో క‌ట్ట‌లేద‌ని కొంద‌రిపై ఆరోపణ‌లు వ‌చ్చాయి. అయితే అవ‌న్నీ గ‌తం అనుకుంటే.. నేటి ఉద‌యం ఉన్న‌ట్టుండి ఉలిక్కిప‌డేలా అగ్ర నిర్మాత కం ఇండ‌స్ట్రీ డీన్ డి.సురేష్ బాబుపైనా.. రామానాయుడు స్టూడియోస్ పైనా ఐటీ దాడులు జ‌ర‌గ‌డంతో అది కాస్తా స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది.

కేవ‌లం డి.సురేష్ బాబుపైనే కాదు.. ప‌లువురు టాప్ హీరోల‌పైనా ఐటీ ఎటాక్స్ జ‌ర‌గ‌నున్నాయ‌ని స‌మాచారం అందుతోంది. దీంతో స‌ద‌రు హీరోలు ఎలెర్ట్ అయ్యార‌న్న‌ది తాజా అప్ డేట్. ఇక ఇప్పుడున్న రైజింగ్ స్టార్ల‌లో నేచుర‌ల్ స్టార్ నాని పేరు ఐటీ లిస్ట్ లో ఉంద‌ట‌. ఏడాదికి రెండు మూడు సినిమాల్లో న‌టిస్తున్న నానీ వార్షికాదాయం 25కోట్లు పైగా ఉంది. ఒక్కో సినిమాకి 10-12 కోట్లు అందుకుంటున్నాడు. అందుకే ఐటీ క‌న్ను ప‌డిందా..? అంటూ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. డి.సురేష్ బాబు వార‌సుడు రానా స‌హా వారితో అనుబంధం ఉన్న ఇత‌ర బ్యాన‌ర్లు.. కంపెనీల‌పైనా ఐటీ అధికారులు దాడులు చేశార‌ని స‌మాచారం అందింది. అలాగే సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ స‌హా నానీపైనా ఐటీ సోదాలు సాగుతున్నాయ‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో హోరెత్తుతోంది. జెర్సీ సినిమా కోసం నానీ భారీగానే పారితోషికం అందుకున్నార‌ని .. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల‌కు బాగానే ముడుతుండ‌డంతోనే ఐటీ అధికారులు ఆరాలు తీసి దాడులు చేశార‌ని ప్ర‌చారం సాగుతోంది.

వ‌రుస‌గా సినిమావాళ్ల‌పై ఐటీ దాడుల నేప‌థ్యంలో ఏది రూమ‌ర్? ఏది నిజం? అంటూ ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్స్ లో ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. నేచుర‌ల్ స్టార్ నానీపై ఐటీ దాడుల‌కు సంబంధించిన స‌రైన స‌మాచారం ఏదీ రాలేదు. అయితే సోష‌ల్ మీడియా గాసిప్పులు మాత్రం వేడెక్కిస్తున్నాయి. కేవ‌లం నానీయేనా ఇంకా ఎవ‌రైనా హీరోల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయా? ఏది నిజం.. ఏది అబద్దం అన్న‌ది వేచి చూడాలి.