Begin typing your search above and press return to search.

సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై ఊహాగానాలు

By:  Tupaki Desk   |   17 Oct 2021 7:30 AM GMT
సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై ఊహాగానాలు
X
మెగా మేన‌ల్లుడు.. సాయి ధరమ్ తేజ్ ప్రేమాయ‌ణం పెళ్లి వ్య‌వ‌హారంపై అప్ప‌ట్లో ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపించాయి. అత‌డి పెళ్లి వ్య‌వ‌హారంపై అప్పుడప్పుడు అనేక ఊహాగానాలు షికార్ చేస్తూనే ఉన్నాయి. సోలో బ్రతుకే సో బెటర్ విడుదల సమయంలో సాయి తనకు ఇప్పుడే సెటిల్ అయ్యే ఆలోచన లేదని తన పెళ్లిని వీలైనంత ఆలస్యం చేస్తున్నాన‌ని వెల్లడించాడు. అయితే త‌న క‌జిన్.. హీరో అల్లు శిరీష్ తాజా పోస్ట్ ర‌క‌ర‌కాల సందేహాల‌ను రాజేసింది. ఆ పోస్టింగ్ సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి కొత్త ఊహాగానాలకు దారితీసింది.

సాయి పుట్టినరోజు సందర్భంగా .. నిహారిక కొణిదెల త‌న‌ దాయాదులందరూ సాయికి శుభాకాంక్షలు చెబుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. శిరీష్ ఏమ‌ని రాసారంటే.. ``ఒంటరి మనిషిగా ఇది మీ చివరి పుట్టినరోజు అని నేను ఆశిస్తున్నాను. త్వరలో మీరు పెళ్లి వార్తలతో ముందుకు వస్తారు`` అని శిరీష్ వ్యాఖ్య‌ను జోడించాడు.

ఈ ప్ర‌క‌ట‌న‌లో క్లారిటీ మిస్స‌యినా సాయి తేజ్ ని ఆట ప‌ట్టించాల‌నే అలా రాశారా? అన్న‌ది అభిమానుల సందేహం. కార‌ణం ఏదైనా శిరీష్ వ్యాఖ్య సాయి తేజ్ పెళ్లి మ్యాట‌ర్ ని తిరిగి వెలుగులోకి తెచ్చింది. సాయి తన బైక్ ప్రమాదం అనంత‌రం ఇప్ప‌టికి పూర్తిగా కోలుకున్నాడు. త‌న‌ పుట్టినరోజున ఆస్ప‌త్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను నవంబర్ లో షూటింగుల్లో పాల్గొంటార‌ని తెలిసింది. ఇప్ప‌టికే అత‌డు ఒప్పుకున్న త‌దుప‌రి సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభిస్తాడు.