Begin typing your search above and press return to search.
ప్రభాస్ పెళ్ళి అయ్యేవరకూ ఊరుకునేలా లేరుగా!
By: Tupaki Desk | 13 Aug 2019 8:06 AM GMTబాలీవుడ్ లో అత్యంత సీనియర్ బ్యాచిలర్ ఎవరు అంటే వెంటనే సల్మాన్ ఖాన్ అని చెప్తారు. ఆయన పెళ్ళి గురించి మీడియాలో వచ్చిన కథనాలు మరే ఇతర ఇండియన్ సెలబ్రిటీ పెళ్ళి పైన కూడా వచ్చి ఉండదు. ఇదిగో ఈద్ కు పెళ్ళి అంటారు.. అదుగో క్రిస్మస్ కు పెళ్ళి అంటారు.. లులియా వంటూర్ అంటారు.. కత్రినా కైఫ్ అంటారు. అయితే భాయిజాన్ మాత్రం వాటితో సంబంధం లేకుండా బ్యాచిలర్ గా తాపీగా తిరుగుతూ ఉంటాడు. బాలీవుడ్ మీడియాకు సల్మాన్ పెళ్ళి టాపిక్ పై కథనాలు ప్రచురించి ప్రచురించి రొటీన్ అనిపించిందేమో కానీ ఈమధ్య మన డార్లింగ్ ప్రభాస్ పైన పడ్డారు.
'బాహుబలి 1 & 2' తో భారీ విజయం సాధించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న ప్రభాస్ కు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. డార్లింగ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో ఇప్పటికే ఎన్నో సార్లు ప్రభాస్ వివాహంపై వార్తలు వచ్చాయి. అనుష్కతో మరో వారం లో పెళ్ళి అన్నట్టుగా కూడా కథనాలు వండి వార్చారు. అయితే అవన్నీ ఉత్తుత్తి వార్తలుగానే మిగిలిపోయాయి. మన తెలుగు మీడియాలో ప్రభాస్ వివాహం గురించి వార్తలు దాదాపు తగ్గాయి. తాజాగా 'సాహో' విడుదల హంగామా ప్రారంభమైంది కదా.. దీంతో మరోసారి బాలీవుడ్ మీడియాలో ప్రభాస్ వివాహం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ప్రభాస్ కు రీసెంట్ గా ఒక ఎన్నారై సంబంధం వచ్చిందట. వైజాగ్ కు సంబంధించిన తెలుగు బిజినెస్ ఫ్యామిలీ ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యారట. ఆ వ్యాపారవేత్తకు ఒక్కగానొక్క కూతురు ఉందని.. ఆ అమ్మాయిని ప్రభాస్ కు ఇచ్చి వివాహం జరిపించాలని తీవ్రంగా ప్రయత్నాలు జరుతున్నాయట. కానీ ప్రభాస్ మాత్రం ఆ మ్యాచ్ ను పెళ్ళి చూపుల వరకూ కూడా వెళ్ళనివ్వకుండా రిజెక్ట్ చేస్తున్నాడట. ఇంతటితో స్టొరీ అయిపోతే బాలీవుడ్ కు టాలీవుడ్ కు తేడా ఏముంటుంది చెప్పండి?
ప్రభాస్ అనుష్కతో ఇంకా డేటింగ్ చేస్తున్నాడట.. స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి మారీ 'సాహో' ను అనుష్కకు చూపించాడట. ఇద్దరూ ఇంకా సీక్రెట్ గా కలుస్తూనే ఉన్నారట. ఇదంతా జరుగుతున్నా ప్రభాస్ కుటుంబంలో అనుష్కతో వివాహానికి సమ్మతించడం లేదట. దీంతో విసిగిపోయిన డార్లింగ్ తనకు వస్తున్న సంబంధాలను పెళ్ళి చూపులవరకూ కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నాడట. మరి ఇది నిజమో కాదో దేవుడెరుగు!
ఇదంతా చూస్తుంటే మన తెలుగు మీడియా ప్రభాస్ ను ప్రశాంతంగా వదిలేసినా ముంబై మీడియా మాత్రం ఏదో ఒకటి చేసి డార్లింగ్ కు పెళ్ళి చేసేవరకూ ఊరుకునేలా లేదు. రీసెంట్ గా 'సాహో' ప్రెస్ మీట్ లో ఎన్నారై అమ్మాయితో వివాహం గురించి.. అనుష్కతో డేటింగ్ వార్తల గురించి అడిగితే ఆన్నీ గాసిప్స్ కు 'నో' అంటూ ఒక చిన్నమాటతో క్లారిటీ ఇచ్చాడు.