Begin typing your search above and press return to search.
స్పీడు పెంచిన మెగా డైరెక్టర్!
By: Tupaki Desk | 2 Sep 2022 12:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` మూవీ తరువాత మూడు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా తెరకెక్కుతున్న `గాడ్ ఫాదర్`. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని విజయ దశమి సందర్భంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన వర్క్ జరుగుతోంది. ఇదిలా వుంటే తమిళ హిట్ ఫిల్మ్ `వేదాలం` ఆధారంగా `భోళా శంకర్` లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది కూడా చిత్రీకరణ దశలో వుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మాత్రం దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న చిరు 154 ప్రాజెక్ట్ నిలవబోతోంది. ఈ మూవీకి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ ని చిత్ర బృందం పరిశీలిస్తోంది.
దాదాపుగా ఇదే టైటిల్ ని ఖరారు చేసే అవకాశం వుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యం భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అతిథి పాత్రలో నటిస్తున్నారు.
అతిథి పాత్రకు ఎక్స్ టెండ్ గా ఈ క్యారెక్టర్ వుంటుందని తెలిసింది. ఇక రవితేజకు జోడీగా కేథరిన్ కనిపించబోతోంది. సినిమాలో చిరంజీవి, రవితేజ సవతి సోదరులుగా నటిస్తున్నారు. ఆగస్టు 1 న టాలీవుడ్ నిర్మాతలు షూటింగ్ ల బంద్ కు పిలుపునివ్వడంతో గత కొన్ని రోజులుగా సినిమాల షూటింగ్ లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ లు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రావారం చిరు - బాబీల మూవీ కీలక షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు.
ఈ భారీ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర కీలక నటీనటులు పాల్గొంటున్నారు. తాజా షెడ్యూల్ లో కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేయనున్నారట. గత కొన్ని రోజులుగా షూటింగ్ లు బంద్ కావడంతో నెల రోజుల గ్యాప్ రాండంతో దర్శకుడు బాబి దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి డైహార్డ్ ఫ్యాన్ అయిన బాబీ ఈ మూవీని మరిన్ని ప్రత్యేకతలతో మాస్ ఎలిమెంట్స్ తో మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన ప్రతీ అంశాన్ని జోడించి తెరకెక్కిస్తున్నాడట.
మాస్ మహారాజా రవితేజ అత్యంత కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. కథ, మాటలు, దర్శకత్వం బాబీ నిర్వహిస్తుండగా స్క్రీన్ ప్లే ని కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, ఆర్దర్ ఏ. విల్సన్, ఎడిటింగ్ నిరంజన్ దేవరమనే, ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్ ప్రకాష్
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.