Begin typing your search above and press return to search.

వార్నీ బెల్లంకొండకు అన్ని థియేటర్లా?

By:  Tupaki Desk   |   4 Feb 2016 1:30 PM GMT
వార్నీ బెల్లంకొండకు అన్ని థియేటర్లా?
X
తన సినిమాలు సాధారణంగా 600 థియేటర్లలో రిలీజవుతుంటాయని అక్కినేని నాగార్జున ఈ మధ్య ‘సోగ్గాడే చిన్నినాయనా’ విడుదలకు ముందు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. యువ కథానాయకుల హవా వల్ల ఈ మధ్య కొంచెం జోరు తగ్గించేసినప్పటికీ నాగ్ ఎంతైనా స్టార్ హీరోనే. అలాంటి హీరో తన సినిమాలకు బెంచ్ మార్క్ 600 థియేటర్లే అంటుంటే.. పెద్దగా బ్యాగ్రౌండ్ లేని, స్టార్ ఇమేజ్ కూడా లేని బెల్లంకొండ శ్రీనివాస్.. తన రెండో సినిమాకే 800 థియేటర్ల దాకా దక్కించుకుంటుండటం విశేషం. శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ పవర్ ఏంటన్నది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

ఈ శుక్రవారం శ్రీనివాస్ సినిమా ‘స్పీడున్నోడు’ ప్రపంచ వ్యాప్తంగా 800 థియేటర్లలో రిలీజ్ కాబోతుండటం విశేషం. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా 180కి పైగా థియేటర్లలో రిలీజవుతోంది. రాయలసీమలో 100కు పైగా థియేటర్లు దక్కాయి. ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలు కలిపి 270 దాకా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక కర్ణాటకలో 75కి పైగా స్క్రీన్స్ లో, తమిళనాడులో 30 + స్క్రీన్స్ లో, ఇండియాలోని మిగతా అన్ని ప్రాంతాలు కలిపి 80 + స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలో సైతం దాదాపు 50 స్క్రీన్స్ ‘స్పీడున్నోడు’కి ఇవ్వడం విశేషం. మొత్తంగా దాదాపు 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు భీమనేని శ్రీనివాసరావు. ఐతే ఎంత భారీగా విడుదలైంది అనేదానికంటే ఎంత బాగా పెర్ఫామ్ చేసిందన్నది ముఖ్యం. మరి శ్రీనివాస్ సినిమా ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.