Begin typing your search above and press return to search.

చెప్పుల కోసం అంత ఖ‌ర్చు చేస్తోందా బాబోయ్!

By:  Tupaki Desk   |   19 Feb 2021 1:30 AM GMT
చెప్పుల కోసం అంత ఖ‌ర్చు చేస్తోందా బాబోయ్!
X
సెల‌బ్రిటీలు ఆర్జ‌న‌కు త‌గ్గ‌ట్టే మెయింటెనెన్స్ కి ఖ‌ర్చు చేస్తుంటారు. వ్య‌క్తిగ‌త ప‌నివాళ్ల‌కు జీతాలు భారీగానే చెల్లిస్తుంటారు. ప‌ని ఉన్నా లేక‌పోయినా బేటాలిస్తుంటారు. ఇక ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ అల్ట్రా రిచ్ గా ఉండాలంటే ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌వి మాత్ర‌మే కొనుక్కుంటారు ఏవైనా.

ఇదిగో ఇక్క‌డ ర‌కుల్ తొడుక్కున్న నారింజ రంగు చెప్ప‌ల్స్ ని చూశారు క‌దా? వీటి ఖ‌రీదు ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ తింటారు. అక్ష‌రాలా ఆ చెప్పుల ఖ‌రీదు 45000 రూపాయలు! చెప్పుల‌కే అంత పెట్టాలా? అంత ఖ‌రీదైన‌వా ఏంటీ ప్ర‌త్యేక‌త అంటే.. అవి ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ బ్రాండ్ హీర్మేస్ కంపెనీవి. పాపుల‌ర్ ఓరన్ చెప్పులు ఐకానిక్ హెచ్ కటౌట్ తో ఎంతో ప్ర‌త్యేకంగా సౌక‌ర్యంగా ఉంటాయి.

బాలీవుడ్ భామ‌ల్లో కియారా అద్వానీ .. ర‌కుల్ ఈ బ్రాండ్ ని వాడ‌తారు. అలాగే వ‌రుణ్ ధావ‌న్ వైఫ్ నటాషా దలాల్ చాలా సంద‌ర్భాల్లో ఈ చెప్ప‌ల్స్ ని ధరించారు. కేవ‌లం ఖ‌రీదైన కాస్ట్యూమ్స్ ధ‌రించ‌డ‌మే కాదు.. వాటికి కాంబినేష‌న్ హ్యాండ్ బ్యాగులు.. చెప్ప‌ల్స్ కోసం కూడా భారీగా ఖ‌ర్చు చేస్తుంటారు వీళ్లంతా.