Begin typing your search above and press return to search.

జెర్సీ లిరికల్ సాంగ్: స్పిరిట్ అదిరిపోయిందిగా!

By:  Tupaki Desk   |   7 March 2019 2:28 PM GMT
జెర్సీ లిరికల్ సాంగ్: స్పిరిట్ అదిరిపోయిందిగా!
X
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ'. నూతన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా సినిమా నుండి 'స్పిరిట్ ఆఫ్ జెర్సీ' అనే టైటిల్ తో కొత్త లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ పాటకు సాహిత్యాన్ని అందించిన వారు కృష్ణకాంత్. పాడిన వారు ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అనే సంగతి తెలిసిందే. ఒక్కముక్కలో సాంగ్ ఎలా ఉందో చెప్పాలంటే సూపర్బ్. రెండుముక్కల్లో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్. ఈ పాటకు అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈ పాట గురించి మొదటగా చెప్పుకోవాల్సింది కృష్ణకాంత్ లిరిక్స్. ఊపు తెప్పించే అద్భుతమైన పదాలతో మ్యాజిక్ చేసేశాడు.. "తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే.. కొలవని వేగమే అడుగులొ చూపటానికే మరిచిన తారవే ముసుగిక నేడు వీడెలె పరుగుల దాహమే బరువిక తేలికాయెలే అణిగిమణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా" అంటూ సాగింది పాట. ఈ పాటకు అనిరుధ్ ఒక జోష్ ఉన్న ట్యూన్ ఇస్తే కాలభైరవ తన మెస్మరైజింగ్ వాయిస్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళిపోయాడు. ఇక నాని స్పోర్ట్స్ జెర్సీ ధరించి.. రఫ్ గా ఉండే గడ్డంతో ఒక ఇంటెన్సిటీతో ఉన్న లుక్స్ కూడా ఈ పాటకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి.

అనిరుధ్ తన మొదటి తెలుగు సినిమాతో చాలామంది తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచి ఉండొచ్చేమో కానీ ఈ సినిమాతో మాత్రం వారందరి మెప్పు పొందడం ఖాయమే. ముఖ్యంగా నాని సినిమాకు రిఫ్రెషింగ్ మ్యూజిక్ తో కొత్త ఫీల్ తీసుకొచ్చేలా ఉన్నాడు. ఆలస్యం ఎందుకు.. జెర్సీ స్పిరిట్ స్పిరిట్ సంగతి ఏంటో చూసేయండి.