Begin typing your search above and press return to search.
విన్ పెట్రోల్ తో ఆ ముగ్గురు ఏం చేస్తున్నారో
By: Tupaki Desk | 8 Dec 2015 10:30 PM GMTబాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.. విన్ డీజిల్ తో ఉన్న పిక్చర్ ను ఆన్ లైన్ లో పోస్ట్ చేసినప్పటి నుంచి ఆ ఫోటోపై బోలెడంత ఆసక్తి నెలకొంది. మొదట కేవలం గుండు మాత్రమే కనిపించేలా పోస్ట్ చేసిన దీపిక.. తర్వాత అది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ స్టార్ విన్ డీజిల్ దేనంటూ, తాము కలిసి ఉన్న పిక్ ని కూడా షేర్ చేసింది. దీంతో దీపిక హాలీవుడ్ ఎంట్రీపై బోలెడు న్యూస్ హల్ చల్ చేశాయి.
అయితే ఇప్పుడు అదే ఫోటో ఆధారంగా బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్ - అభిషేక్ బచ్చన్ - రితేష్ దేశ్ ముఖ్ లు మంచి స్పూఫ్ మాదిరిగా తయారు చేసేసేశారు. హౌస్ ఫుల్ 3 లో కలిసి నటిస్తున్న ఈ ముగ్గురు అదే గుండు ఫోటోతో కామెడీగా ఓ పిక్ రూపొందించారు. దీన్ని ఆన్ లైన్ లో షేర్ చేసిన అభిషేక్ బచ్చన్.. అదిరిపోయే కామెంట్ తో ఆకట్టుకున్నాడు.
"విన్ డీజిల్ దీపికా పదుకొనేతో బిజీగా ఉండడంతో.. మేం ఇప్పుడు హౌస్ ఫుల్ 3 ని విన్ పెట్రోల్ తో చేస్తున్నాం" అంటూ వేసిన పంచ్.. బాగా పేలింది. గతంలో అక్షయ్, రితేష్ లతో కలిసి హౌజ్ ఫుల్ సిరీస్ లో నటించింది దీపిక. మరి తన పిక్ ని ఇంతలా కామెడీ చేసేసిన ఈ హౌస్ ఫుల్ 3 హీరోలపై దీపిక రియాక్షన్ ఏంటో ?