Begin typing your search above and press return to search.
ఈ స్ఫూఫ్ లు తప్ప.. రైటర్లకేం చేతకాదా?
By: Tupaki Desk | 15 Dec 2015 7:30 AM GMTమన రైటర్లంతా పక్కా మూస రైటర్లు. డైరెక్టర్లు కూడా అంతే. వీళ్లకు ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడే ఇష్టం. అందుకే పదే పదే అవే చింతకాయ పచ్చళ్లు జనాల నెత్తిన రుద్దేస్తున్నారు. ఎప్పడూ రాసిందే రాస్తారు. తీసిందే తీస్తారు. చూపించిందే చూపిస్తారు. మతి చెడగొట్టేస్తారు.. అందుకే మన కంటే తమిళ తంబీలు రైటింగ్ లో పై స్థాయిలోనే కొనసాగుతున్నారు. మన రైటర్లు రాసింది ఫైనల్ చేసేందుకు చెన్నయ్ నుంచి తంబీ రైటర్స్ దిగాల్నట. ఎవరో మన టాలీవుడ్ టాప్ రైటర్ ఒకరు చెప్పారు లెండి. ఇంకా మనవాళ్లంతా స్ఫూఫ్ లు రాసుకుంటూ పాతకాలంలోనే ఉన్నారు. అప్ డేటెడ్ యాండ్రాయిడ్లా మారే థింకింగ్ వీళ్లదగ్గర అస్సలు ఉండదు. ఎగ్జిస్టెడ్ రైటర్ల పని ఎప్పుడూ ఇంతేనంటూ ఛీదరించుకున్నారు.
ఇవిగో ఇటీవలే మాస్ మహారాజా రవితేజ సినిమాలో స్ఫూఫ్ లు వండి వార్చారు. అందుకు అత్తారింటికి దారేది - శ్రీమంతుడు లాంటి హిట్ సినిమాల్ని టార్గెట్ చేశారు. మన తెలుగు సినిమాలు చూస్తే ఎప్పుడూ ఇంతే అని అనుకోవాల్సిందే. ఇప్పటికిప్పుడు ఓ డజను సినిమాల్లో స్ఫూఫ్ లే వండి వార్చారుట. ఈ వారం రిలీజ్ కి వస్తున్న గోపిచంద్ సౌఖ్యం - వారాహి జత కలిసే చిత్రాల్లోనూ సేమ్ స్ఫూఫ్ లు దర్శనమీయబోతున్నాయ్. సౌఖ్యంలో 30 ఈర్స్ పృథ్వీ బాహుబలి శివుడిగా శివలింగాన్ని ఎత్తే సన్నివేశం కనిపిస్తుంది. ఇక జతకలిసే సినిమాలో సప్తగిరి శ్రీమంతుడు సైకిల్ తొక్కుకొచ్చే సీన్ లో కనిపిస్తాడు. ఇదంతా చూస్తుంటే ఇక మనవాళ్లు మారరా? అనిపిస్తోంది. ఈ స్ఫూఫ్ లు తప్ప వేరే కామెడీ చేయించడం మనవాళ్లకు చేతకాదా?