Begin typing your search above and press return to search.

ఇండియా సీక్రెట్ స్టోరీ చెప్పబోతున్న నిఖిల్..!

By:  Tupaki Desk   |   6 May 2023 5:24 PM GMT
ఇండియా సీక్రెట్ స్టోరీ చెప్పబోతున్న నిఖిల్..!
X
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ గురించి.. ఆయన టాలెంట్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో మంచి హిట్లు అందుకున్న ఈయన ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లతో సతమతమయ్యాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత స్వామి రారాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

గతేడాది కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నిఖిల్. ఈ చిత్రం ఎన్నో అవార్డులను అందుకోవడంతో పాటు మరెన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రం తర్వాత నిఖిల్ ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. స్పై అనే చిత్రంతో అందరినీ అలరించేందుకు సిద్ధం అయ్యాడు. అయితే స్పై కూడా.... కార్తికేయ-2 లాగే యూనివర్సల్ అప్పీల్ కలిగి ఉంటుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ స్పై చిత్రం రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ కాదని... ఓ నేషనల్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. భారతదేశం యొక్క రహస్య కథను ఈ సినిమా చెబుతోందని తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో సుభాష్ చంద్రబోస్ లోగో మరియు అతని నినాదం కూడా ఉంది. అదేంటంటే... తుమ్ ముజే ఖూన్ దో, మైన్ తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అని ఉంది. ఇందులో నిఖిల్ లుక్ అదిరిపోయింది.

యూనిక్ పాయింట్‌తో ఈ సినిమా బహుభాషా చిత్రంగా రూపొందుతోంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమా ద్వారానే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే చరణ్‌ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఎడ్ ఎంటర్ టైన్ మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా టీజర్ మే 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. అలాగే జూన్ 29వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిందీ చిత్రబృందం.

నిఖిల్ సరసన ఈ చిత్రంలో ఈశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఆర్యన్ రాజేష్ ఈ సినిమా ద్వారానే రీఎంట్రీ ఇచ్చి ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ ఇలా.. ఐదు భాషల్లో విడుదలయ్యే పూర్తి యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు.