Begin typing your search above and press return to search.

స్పైడర్ లో ఎస్పీడీ.. శర్వా ఓసీడీ

By:  Tupaki Desk   |   29 Sep 2017 5:30 AM GMT
స్పైడర్ లో ఎస్పీడీ.. శర్వా ఓసీడీ
X
విలన్స్ బాగా క్రూరంగా ప్రవర్తిస్తుండడం సినిమాల్లో ఎప్పుడూ చూసే వ్యవహారమే. కానీ అలా ప్రవర్తించడానికి కూడా కారణాలను చూపించే వ్యవహారం.. ఎక్కువగా మూవీస్ లో కనిపించదు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన స్పైడర్ మూవీలో విలన్ కి ఎస్పీడీ అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే.. శాడిస్టికల్ పర్సనాలిటీ డిజార్డర్ అన్న మాట. ఇది అందరిలోనూ 4 శాతం ఉంటుంది.. స్పైడర్ విలన్ ఎస్ జే సూర్యలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే స్పైడర్ మూవీకి బేస్. ఇలా ఎస్పీడీ అనే రోగాన్ని విలన్ తగిలించాడు దర్శకుడు మురుగదాస్.

ఇవాళ రిలీజ్ అవుతోన్న మహానుభావుడు చిత్రంలో హీరోకు ఓసీడీ అనే రోగం ఉంటుంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వ్యాధి గల హీరో.. అతి శుభ్రత పాటిస్తుంటాడు. దీని చుట్టూ రాసుకున్న నవ్వుల కథే మహానుభావుడు. హీరోలకు ఇలా రోగాలు తగిలించడం మారుతికి కొత్తేమీ కాదు. గతంలో నానిని మతిమరుపు హీరోగా మలిచి హిట్ కొట్టాడు. అయితే.. స్పైడర్ లో విలన్ కి గల ఎస్పీడీ కారణంగా.. క్రూరంగా మారిపోయి హత్యలు చేసేసి.. అవతలి వారి ఏడుపులో ఆనందాన్ని వెతుక్కుంటాడు. కానీ మన మహానుభావుడు మాత్రం శుభ్రత కోసం తెగ ఇబ్బందులు పడిపోయి.. ఇబ్బందులు పెట్టేస్తుంటాడు.

ఇలా రెండు విభిన్నమైన జబ్బుల ఆధారంగా రూపొందిన రెండు సినిమాలు.. అది కూడా రెండు రకాల కేరక్టర్ల(ఒకటి హీరోకి.. ఒకటి విలన్ కి)కు తగిలించి సినిమాలు.. రెండు రోజుల గ్యాప్ లో.. థియేటర్లలోకి రావడం కాసింత ఆశ్చర్యకరమే.