Begin typing your search above and press return to search.
మళ్లీ క్లైమాక్స్ కి వచ్చిన స్పైడర్
By: Tupaki Desk | 15 May 2017 10:51 AM GMTమహేష్ బాబు లేటెస్ట్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. రీసెంట్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి గోవా టూర్ వెళ్లడంతో షూటింగ్ కూడా పోస్ట్ పోన్ అయిందని అంతా అనుకున్నారు. కానీ మహేష్ మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
నిమ్స్ తో పాటు పలు కీలక ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతుండగా.. కొన్ని రాజకీయపరమైన లొకేషన్ సంబంధిత సమస్యలు ఎదురయ్యాయట. దీంతో ఈ షూటింగ్ ను దర్శకుడు మురుగదాస్ చెన్నైకు షిఫ్ట్ చేసేస్తున్నాడు. ఇప్పుడు చెన్నైలో భారీ సెట్స్ వేసి క్లైమాక్స్ పార్ట్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అదే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే ఓసారి ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ చేశారు. అది కూడా చెన్నైలోనే భారీ సెట్స్ వేసి మరీ చిత్రీకరించారు. మళ్లీ ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్ చేయడం ఏంటనే ఆశ్చర్యం సహజమే. అయితే.. తొలుత చిత్రీకరించిన క్లైమాక్స్ మహేష్ కు నచ్చలేదట.
అందుకే ఇప్పుడు మళ్లీ కొత్త క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారు. దీని తర్వాత రెండు పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉండనుండగా.. వీటిని ఫారిన్ లొకేషన్స్ లో మహేష్-రకుల్ ప్రీత్ లపై షూట్ చేయనున్నారు. ఇంకా గ్రాఫిక్ వర్క్ కూడా పెండింగ్ ఉండడంతో.. ఈ చిత్రం ఆగస్ట్ వరకూ థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.